బెజవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి.భక్తుల దర్శనార్థం ఇంద్రకీలాద్రిలోని అమ్మ రోజుకో రూపుదాలుస్తున్న సంగతి తెలిసిందే. 
నవరాత్రులలో ఏడవ రోజైన ఈ రోజు మాత సరస్వతి దేవి గా కనిపించనున్నారు. హిందూ మతంలోని స్త్రీ శక్తి స్వరూపాలలో ఒకరైన సరస్వతీ దేవిని ప్రధానంగా చదువు కొరకు చదువుల తల్లిగా ఆరాధించడం జరుగుతుంది. విద్యాబుద్ధులకు మూలమైన ఈ తల్లి మూల నక్షత్రం లో జనించడం ఒక ప్రత్యేకం.

శక్తి స్వరూపాలతో చెడుని అంతమోనర్చేందుకు సాక్ష్యత్తు దుర్గామాతే సరస్వతిగా రూపు దాల్చింది అని భక్తుల విశ్వాసం. అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞానసముపార్జన చేసే దిశగా మాత నడిపిస్తుంది. సరస్వతీ త్వయం దృష్ట్యా వీణా పుస్తకధారిణీ! హంస వాహసమాయుక్తా విద్యాదాన కరీమమ!! అనగా ఒక చేత వీణా ఇంకొక చేతిలో పుస్తకాన్ని ధరించిన ఓ సరస్వతి మాత! హంసని వాహనంగా కలిగిన ఓ సరస్వతీ స్వయంగా ని దృష్టితో నాకు విద్యని దానముగా ప్రసాదించుము !! అని సరస్వతి మాత ఎల్లప్పుడూ తెల్లని వస్త్రధారణని ప్రతీకగా చేస్కుంటుందన్న సంగతీ తెలిసినదే దాని ప్రాముఖ్యత కేవలం వస్త్రములో కాదు పాల వంటి స్వచ్ఛమైన తెల్లని మంచి మనసును తాను వస్త్రముగా ఆభరణాలుగా చేసి ధరించినది అని.
భారతిదేవి, శారదా దేవి, చంద్ర గంటా ఇలాంటి ఎన్నో పేర్లతో అమ్మని భక్తులు కొలుస్తుంటారు. 

ఇదిలా వుంటే ఈ రోజు మన రాష్ట ముఖ్యమంత్రివర్యులు శ్రీ.వై.యస్.జగన్మోహన్ రెడ్డి గారు పట్టువస్త్రాలు సమర్పించడంతో... ఉత్సవాల సందడి మరింత పెరిగింది.ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌, కొందరు మంత్రులు అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రభుత్వం తరపున సీఎం జగన్‌ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. దుర్గమ్మ దర్శనం తర్వాత అర్చకులు... సీఎం జగన్‌ను వేదమంత్రాలతో ఆశీర్వచనమిచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: