ఇక బ్రహ్మోత్సవాలు అంటే అందరికి ముందుగా గుర్తుకు వచ్చేది తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామి. అత్యంత వైభవంగా ఈ  బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ప్రతి సంవత్సరం లాగానే ఇప్పుడు కూడా తిరుమల వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఇక ఏపీ సీఎం జగన్ ఇటీవల తిరుమల ఆలయానికి పట్టు వస్త్రాలు కూడా సమర్పించారు. అందరికి బ్రహ్మోత్సవాలు అంటే చాల ఇష్టం.

ఇక మామూలుగానే  తిరుమల భక్తులతో కిక్కిరిసిపోతుంది. ఇక  బ్రహ్మోత్సవాలు  వస్తే చెప్పవలసిన పని లేదు. బ్రహ్మోత్సవాలు  భాగంగా ఐదో రోజు శుక్రవారం గరుడ వాహనంపై శ్రీవారు తిరువీధుల్లో విహరించారు. అశేష భక్త జనసందోహం నడుమ ఘనంగా ఊరేగింపు కొనసాగించారు. మలయప్ప స్వామివారికి గరుడ వాహనంపై ఊరేగింపు నిర్వహించారు.ఇక గరుడ సేవ సందర్భంగా నాలుగు మాఢవీధుల్లోని గ్యాలరీలు భక్తులతో కిక్కిరిశాయి.

 గోవింద నామస్మరణతో తిరుమల భక్తి శ్రద్ధలతో నిండింది. భక్తుల కోలాటాలు, వాయిద్యాలు, ఇతర కళాప్రదర్శనల నడుమ గరుడ వాహ‌న‌సేవ కోలాహ‌లంగా సాగింది. బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆరో రోజు శ‌నివారం హ‌నుమంత వాహ‌నం, స్వ‌ర్ణ‌ర‌థం, రాత్రికి గ‌జ‌వాహనంపై శ్రీవారు విహరించనున్నారు.ఇక గరుడ వాహనంపై స్వామి వారిని చూడడం వలన ఉపయోగాలు ఏమిటో చూద్దామా  మరి.

గరుడ వాహనంపై ఉన్న స్వామివారిని దర్శించడం ద్వారా సర్పదోష శాంతి, దివ్యమైన జ్ఞానం కలుగుతుందని భక్తుల విశ్వాసం. సమస్త వాహనాలలో సర్వశ్రేష్ఠమైన గరుడ వాహనంపై ఉన్న స్వామిని దర్శిస్తే, స్వర్గం ప్రాప్తించి, ఇహపరమైన ఈతి బాధల నుంచి ఉపశమనం లభిస్తుంది అని తెలుపుతుంది. కాబట్టి, బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవ విశిష్టత సంతరించుకుంది. ఈ నేపథ్యంలో శ్రీ‌వారి గ‌రుడ‌సేవ‌కు భారీగా భక్తులు తరలి రావడం జరిగింది. ఇక నేడు గ‌జ‌వాహనంపై శ్రీవారు  దర్శనం ఇస్తారు.



మరింత సమాచారం తెలుసుకోండి: