రేపటితో దసరా శరన్నవరాత్రులు ముగుస్తున్నాయి. దసరా నవరాత్రుల సంబరాలలో నిన్న  8వ రోజు సందర్భంగా దుర్గాదేవిగా అమ్మవారు భక్తులకు దర్శనం ఇచ్చారు.ఇక వారాంతం కావడంతో బెజవాడ ఇంద్రకీలాద్రికి ఆదివారం భక్తులు పోటెత్తారు. మూలా నక్షత్రం సందర్భంగా శనివారం అర్ద రాత్రి నుండి భక్తులు కిట కిటలాడారు.ఇక నిన్న ఒక్క రోజే మూడు లక్షల మందికి పైగా భక్తులు కొండకు వచ్చారని అంచనా. దుర్గాదేవిని ఆరాధించడం ద్వారా అన్నిరకాల దుఃఖాలు తొలగిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి.

అందుకే దుర్గ దేవిని కళ్లారా చూసి... భక్తి పారవర్యంలో భక్తులు మునిగిపోయారు.మనలోని అసూయ, ద్వేషం, అహంకారం వంటి శత్రువుల్నీ సంహరించి శాంత స్వభావాన్ని అలవర్చుకోవాలని దుర్గాదేవి అలంకారం సూచిస్తుంది. ఆయుధాలు ధరించడం... ధైర్యానికి, అన్యాయంపై పోరాటం చెయ్యడానికి... అనుక్షణం సన్నద్ధంగా ఉండే లక్షణానికి నిదర్శనం. రాష్ట్రము నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు రావడంతో రద్దీని కంట్రోల్ చెయ్యడానికి అధికారులు, పోలీసులకు తిప్పలు తప్పలేదు. 


ఇక రేపటితో దసరా శరన్నవరాత్రులు ముగుస్తుండటంతో... భక్తులకు ఏ లోటు లేకుండా చూసేందుకు ఆలయ కమిటీ జాగ్రత్తలు తీసుకుంటుంది. నిజానికి ఇంద్రకీలాద్రిపై అమ్మవారి సహజ స్వరూపం ఇదే.అందుకే ఈ రూపంలో అమ్మవారిని దర్శించుకుంటే... ఎంతో మేలు జరుగుతుందని భక్తులు నమ్ముతున్నారు. దుర్మార్గుడైన మహిషాసురుడిని చంపడానికి  అమ్మవారు ఎనిమిది చేతులతో అవతరించి... సింహంపై వచ్చి... ... సంహరించి.... అప్పటి ప్రజల కష్టాల్ని తొలగించింది.

ఇక అప్పటి నుంచీ ఇంద్రకీలాద్రిపై అమ్మవారికి ప్రత్యేక పూజలు, నవరాత్రులూ జరుపుతున్నారు. నవరాత్రుల్లో ఈ రోజు  ఆశ్వయుజ శుద్ధ నవమి కావడంతో సోమవారం అమ్మవారు మహిషాసురమర్దనిగా దర్శనమిస్తున్నారు. మరోవైపు విజయదశమి రోజున రేపు కృష్ణానదిలో జరిగే తెప్పోత్సవానికి ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ప్రతి సంవత్సరం కృష్ణానదిలో జరిగే తెప్పోత్సవానికి అత్యధికంగా భక్తులు వస్తుంటారు.


మరింత సమాచారం తెలుసుకోండి: