తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొమ్మిదో రోజు సోమవారం ఉదయం చివరి అంకమైన శ్రీవారి చక్రస్నానం వైభవంగా జరిగింది. ఆలయం పక్కనే ఉన్న పుష్కరిణిలో నిర్వహించిన ఈ అపురూప ఘట్టాన్ని తిలకించేందుకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు. భూదేవి, శ్రీదేవి సమేత మలయప్పస్వామిని ఊరేగింపుగా తీసుకొచ్చి పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహించారు.  భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారి ఉత్స‌వ‌మూర్తుల‌కు, చ‌క్ర‌త్తాళ్వార్‌కు స్న‌ప‌న‌తిరుమంజ‌నం, చ‌క్ర‌స్నానం అంగరంగ వైభంగా సాగింది.

చక్రస్నానం అనంతరం రోజంతా పవిత్ర ఘడియలు ఉంటాయి కాబట్టి భక్తులు ఎప్పుడైనా సకల పాపనాశనిగా అయిన పుష్కరిణిలో స్నానం చేయవచ్చు.చక్రస్నానం అనంతరం నిర్వహించే ధ్వజావరోహణతోనే బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.కలి ప్రభావం నుంచి భక్తులను కాపాడి దుర్మార్గుల్ని శిక్షిస్తానని సందేశమిస్తూ.. అశ్వవాహనంపై తిరువీధుల్లో ఊరేగారు. ఆదివారం ఉదయం మూడు గంటల పాటు శ్రీదేవి, భూదేవి సమేతుడైన శ్రీమలయప్పస్వామి మహారథంపై ఊరేగుతూ భక్తులకు అభయప్రదానం చేశారు.వేలాది మంది భక్తులు తిరువీధుల్లో రథాన్ని లాగి భక్తిని చాటుకున్నారు.భక్తులు ప్రశాంతంగా శ్రీవారి మూలమూర్తితో పాటు వాహన సేవలు దర్శించేలా ఏర్పాట్లు చేపట్టామని వివరించారు.

టిటిడిలోని అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది, జిల్లా యంత్రాంగం సమష్టి కృషితోనే ఇది సాధ్యమైందన్నారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ.. లక్షలాది మంది భక్తులు సంయమనంతో వ్యవహరించి క్యూలైన్లు, గ్యాలరీల్లో వేచి ఉన్నారని, భక్తిభావంతో టిటిడికి సహకరించారని ఇందుకు గాను వారికి ధన్యవాదాలు చెబుతున్నట్టు తెలిపారు. భద్రతాపరంగా ఎలాంటి ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేపట్టారని, టిటిడి విజిలెన్స్‌, పోలీసులు సమన్వయంతో వ్యవహరించారని తెలియజేశారు.భక్తులకు చక్కటి వైద్యసేవలు అందించామని, విద్యుత్‌ కటౌట్లు, పుష్పాలంకరణలు, ప్రదర్శనశాలలు ఆకట్టుకున్నాయని తెలిపారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: