నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి అంటే  పిల్లలు, పెద్దల సంబురాలకు హద్దులు ఉండవు. ఈ సంబరాలకు పట్టణాలు, గ్రామాలు అనే తేడా ఉండదు. దేవాలయాలలో హరివిల్లులా మెరిసే విద్యుద్దీపాలంకరణలు, హరికథలు, బుర్రకథ లతో తొమ్మిది రోజులు వైభవంగా ఉంటుంది. హిందువులు భక్తిశ్రద్ధలతో, అత్యంత ప్రీతిపాత్రంగా, ఎంతో వైభవంగా జరుపుకునే పండుగలలో దసరా ఒక ప్రముఖ పండుగ. 


దసరా ఆ రోజు మొదలు అవుతుందో చూద్దామా మరి... అశ్వనీ నక్షత్రంలో కలసి వచ్చిన పూర్ణిమ మాసమే అశ్వీయజమాసం. ఈ మాసంలో శుక్ల పాడ్యమి తిథితో ప్రారంభించి శుక్ల నవమి వరకు 9 రోజులు నవరాత్రి ఉత్సవాలు, 10వ రోజు వచ్చే విజయదశమిని కలిపి దసరా అని అంటారు. ఇది శరధృ తువు ప్రారంభంలో వచ్చే పండుగ కాబట్టి శరన్నవ రాత్రులు అనీ కూడా అంటారు. ఇక దసరా పండుగ రోజు ఆయుధపూజ నిర్వహించటం ఇందుకు నిదర్శనంగా చూడవచ్చు.

ఆ రోజున 'హారేణతు విచి త్రేణ భాస్వత్కనక మేఖలా, అపరాజితా భద్రరతా కరోతు విజయంమమ' మంగళకరమైన దుర్గా! అపరాజితా దేవిగా నాకు విజయమిచ్చుగాక అని ఆ దుర్గాదేవిని ప్రార్థించి, పూజలు చేయటం ఆనవాయితీగా వస్తుంది  మన సంప్రదాయాలలో. ప్రస్తుతం రోజులలో దసరా ఉత్సవాలు అనగానే మనకు గుర్తొచ్చేవి మైసూరు దసరా ఉత్సవాలు.

ఒడయారు రాజవంశీయుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగే ఈ ఉత్సవాలకు దాదాపు 408 సంవత్సరాల చరిత్ర ఉంది అని అందరికి తెలిసిందే. విజయనగర సామ్రాజ్యం పతనమైన తర్వాత ఒడయార్ వంశస్తులు క్రీ.శ. 1610లో శ్రీరంగ పట్టణం వేదికగా ఈ ఉత్సవాలను ప్రారంభించారు గతంలో. తర్వాత కాలంలో వీరు రాజధానిని మైసూరుకు మార్చుకోవటంతో అక్కడ ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం మొదలు పెట్టారు. అప్పటి నుంచి నేటికీ మైసూరు దసరా ఉత్సవాలుగా ప్రపంచఖ్యాతి కూడా పొందింది.


మరింత సమాచారం తెలుసుకోండి: