అసలు శరన్నవరాత్రుల అంటే ఏమిటి అంటే వసంత నవరాత్రులు, ఆషాఢ నవరాత్రులు, శరన్నవరాత్రులు, మాఘ నవరాత్రులు అనే పేర్లతో సంవత్సరంలో నాలుగుసార్లు ఈ అమ్మ వారి నవరాత్రులను ఉత్సవాలుగా జరుపుకుంటారు. చైత్ర శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకూ జరిగే నవరాత్రులను వసంత నవరాత్రులు అని అంటారు. ఆషాఢ శుక్లపక్షంలో జరిపే నవరాత్రులను ఆషాఢ లేదా గాయత్రి లేదా శాకంబరి నవరాత్రులు అంటారు. మాఘమాసంలో తొమ్మిది రూపాలలో మాఘ శుక్ల పక్షాన జరుపు కునే నవరాత్రులను మాఘ నవరాత్రులు లేదా గుప్త నవరాత్రులు అంటారు. ఈ మూడు నవరాత్రులను అన్ని ప్రాంతాల వారు నిర్వహించక పోవచ్చు కానీ శరత్‌ కాలంలో వచ్చే శరన్నవరాత్రులను దేశమంతటా ఘనంగా జరుపుకుంటారు కనుకనే ఈ నవరాత్రులకు అంత ముఖ్య మైన ప్రాముఖ్యం ఏర్పడింది.


ఏ రోజులు ఏ రూపాలతో అలంకరణ చేస్తారో తెలుసా?...నవరాత్రులలో మొదటి మూడు రోజులు దుర్గా స్వరూపాన్ని ఆరాధించి అరిషడ్వర్గాలను, తదుపరి మూడురోజులు లక్ష్మీ స్వరూపాన్ని ఆరాధించి సిరిసంపదలను, చివరి మూడు రోజులు సరస్వతి రూపాన్ని ఆరాధించి జ్ఞానాన్ని పొందవచ్చు. ఈ క్రమంలో నవరాత్రులలో దేవిని పూజించి వాటికీ తగ్గ ఫలితాలు పొందవచ్చునని పెద్దలు చేప్తుంటారు.


అతి ప్రాంతీయ ఆచారాలను బట్టి నవరాత్రులలో దేవీ అలంకారాలు చేస్తారు. బాలాత్రిపురసుందరి, అన్నపూర్ణాదేవి, గాయత్రీదేవి, శ్రీమహాలక్ష్మీదేవి, సరస్వతీదేవి, దుర్గా, మహిషాసుర మర్దిని, శ్రీరాజరాజేశ్వరీదేవిగా 9 రోజులూ 9 రూపాలలో అమ్మవారిని కొలుస్తారు. ఉత్తర భారతంలో మాత్రం  శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంటా, కూష్మాండ, స్కంధమాత, కాత్యాయని, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిధాత్రి లాంటి తొమ్మిది రూపాలలో అమ్మవారిని పూజిస్తారు. 


దశ హరా అంటే పదిరోజుల పండుగ ! పది పాపాలను నాశనం చేసేది అని అర్థం. అదే దసరాగా వాడుకలోకి వచ్చింది. త్రిశక్త్యాత్మకంగా అమ్మవారు పూజలు అందుకుని పదవరోజున అపరాజితాదేవిగా కొలువు తీరుతుంది. ఆశ్వయుజ శుక్ల దశమినాటి సాయం సంధ్యాసమయాన్నే విజయకాలం అంటాం. అది సర్వ కార్యసాధకమైన సమయం. 


మరింత సమాచారం తెలుసుకోండి: