హిందూ స్త్రీలకు పెళ్ళి రోజున పెళ్ళి ముహుర్తానికి ముందు జరిగే నలుగు కార్యక్రమంలో మేనమామ లేక మావ వరుస అయినవారు పెళ్ళికుమార్తె కాళ్ల బొటన వ్రేలి పక్కనున్న వ్రేళ్ళకు వెండి రింగ్ లను తొడుగుతారు, వీటినే మట్టెలు లేక మెట్టెలు అంటారు. అయితే మెట్టెలు ఎందుకు పెడ‌తారు? అన్న ప్ర‌శ్న చాలా మందికి ఉంటుంది. హిందూ వివాహ సంప్రదాయంలో కాలిమట్టెలకు ఉన్న ప్రాధాన్యత అంతాఇంతా కాదు. వివాహం జరిగిన దగ్గర్నుంచి మంగళసూత్రంతో పాటుగా, కాలిమట్టెలు కూడా ఆమె సౌభాగ్యానికి చిహ్నంగా మారతాయి.


ఐతే ఈ మెట్టెలు ధరించడానికి, అందులోను కాలి రెండవ వ్రేలుకు ధరించడానికి కూడా చక్కని కారణాలు ఉన్నాయి. మెట్టెలు ధరించడం వల్ల ముందు ఆ స్త్రీకి వివాహం అయిందనే విషయం తెలుస్తుంది. ఇక ఆరోగ్య విషయానికొస్తే మెట్టెలు ధరించడం వల్ల గర్భశయానికి చాలా మంచిది. కాలి రెండవ వేలి నుండి గర్భాశయానికి ఒక నాడి అనుసంధానమై ఉంటుంది. గుండెను కూడా ఈ నాడీ కలుపుతుంది. కాలి వేలికి మెట్టెలు ధరించడం వల్ల గర్భాశయం దృఢపడుతుంది.


అదే విధంగా వెండితో చేసిన మెట్టెలను ధరించడం భారతీయ సంప్రదాయ పద్ధతి. వెండి మంచి ఉష్ణ వాహకం కావడం వల్ల భూమి నుండి ధృవావేశాలను గ్రహించి శరీర ఇతర అవయాలకు అందజేస్తుంది. అలాగే రక్తప్రసరణను నియంత్రించి, శరీర క్రియలు సక్రమంగా జరిగేటట్లు చేసి ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: