ఆశ్వయుజమాస శుక్లపక్షంలోని మొదటి తొమ్మిది రోజులు నవరాత్రుల పేరుతో రోజుకో రూపంలో దేవి దర్శనమిస్తుంది. ఈ నవరాత్రులలో చివరి మూడురోజులు దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమిగా మనం జరుపుకుంటాం. పాలసముద్ర మధన సమయంలో విజయదశమి రోజునే అమృతం ఉద్భవించిందని పురాణ గాధ. 'శ్రవణా' నక్షత్రంతో కలసిన ఆశ్వయుజ దశమికి 'విజయ' అనే సంకేతముంది. అందుగ్గాను 'విజయదశమి'అనే పేరు వచ్చింది. ఈ రోజున ఏ పని చేపట్టిన విజయం తథ్యం. ఈ రోజు  శమిపుజ ఒక ప్రత్యేకం. శమీవృక్షమంటే 'జమ్మిచెట్టు'. పాండవుల అజ్ఞాతవాస సమయంలో తమ ఆయుధాలను శమీవృక్షంపైనే దాచిపెట్టారు...,, ఆ సమయంలో విరాటరాజు కొలువులో దాగున్న పాండవులు.. తమ ఏడాది షరతు పూర్తికాగానే ఆ వృక్షాన్ని ప్రార్ధించి, తిరిగి తమ ఆయుధాలను పొంది, శమీవృక్ష రూపంలోని 'అపరాజితా దేవి' ఆశీర్వాదం ద్వారా, కౌరవులపై విజయం సాధించారని ప్రతీతి. 

రాముడు కూడా ఈ విజయదశమి నాడే అపరాజితా దేవిని పూజించి, రావణాసురుని సహరించాడు...,, అలాగే రాక్షసుల రాజు మహిషాసురిని సంహరించి కాళీమాత కుడా ఘన విజయం సాధించింది నేడే. శమీపూజ అనంతరం 'పాలపిట్ట'ను చూసే సంప్రదాయముంది..,,, ఈ సాయంత్ర నక్షత్ర దర్శనం తర్వాత శమీవృక్షాన్ని పూజించి, 'శమీ శమయతే పాపం శమీశతృ నివారిణీ, అర్జునస్య ధనుర్థారీ రామస్య ప్రియదర్శినీ' అనే శ్లోకాన్ని స్మరిస్తూ జమ్మిచెట్టుకు ప్రదక్షిణలు చేశాక..,, ఈ శ్లోకం రాసుకున్న చీటీలను చెట్టు కొమ్మలకు తగిలిస్తారు. తద్వారా అమ్మవారి కృప, శనిదోష నివారణ జరుగుతుందని ప్రతీతి.నవరాత్రులు పూర్తయ్యాక… విజయ దశమి రోజున పాలపిట్టను చూడటాన్ని అదృష్టంగా, శుభ సుచికంగా ప్రజలు భావిస్తారు... ఈ సాయంత్రం రావణ సంహరణ పేరుతో నేటికి కొన్నిచోట్ల రావణ బొమ్మని కాల్చడం ఒక విశేషం.. చెడుపై మంచి ఎప్పుడూ గెలుస్తుందని తెలపడమే ఈ పర్వదిన ప్రత్యేకం...

మరింత సమాచారం తెలుసుకోండి: