పరమ శివభక్తుడైన కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ సీనియర్ నేత తన ఇంటితోపాటు కమర్షియల్ కాంప్లెక్స్‌ను శ్రీకాళహస్తి ఆలయానికి చెందేలా శుక్రవారం రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది. చిత్తూరు జిల్లా లో ఉన్న శ్రీకాళహస్తి ఆలయానికి కాంగ్రెస్ సీనియర్ నేత భారీ విరాళం ఇవ్వడం జరిగింది. మొత్తం రూ.15 కోట్లు విలువైన తన నివాసం, కమర్షియల్ కాంప్లెక్స్ సహా ఖాళీ స్థలాన్ని మొత్తం ఆలయానికి విరాళంగా సమర్పించారు. 


తమిళనాడు పొన్నేరి సమీపంలోని మీంజూరుకు చెందిన కాంగ్రెస్‌ నేత వీఆర్‌ భగవాన్‌ ఈ మేరకు రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది. మీంజూరులోని తన ఇల్లు, వ్యాపార భవన సముదాయం, దాని వెనుక ఉన్న ఖాళీ స్థలాన్ని పొన్నేరి రిజిస్ట్రార్‌ కార్యాలయంలో శ్రీకాళహస్తి ఆలయం పేరిట రిజిస్టర్‌ చేయించడం ఒక చాలా పెద్ద విశేషం.

అతి త్వరలోనే ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, ఆస్తులకు సంబంధించిన పత్రాలను ఆలయ అధికారులకు ఇవ్వబోతున్నాను  అని ఆయన తెలిపారు. ఈ మొత్తాన్ని ఆలయ అభివృద్ధికి, వివిధ ధార్మిక కార్యక్రమాలకు వినియోగించాలని ఆయన తెలియచేసారు. శివభక్తుడైన వీఆర్ భగవాన్‌ ద్వాదశ జ్యోతిర్లింగాలను చాలా సార్లు సందర్శించారు. తమిళనాడులో 30కి పైగా ఆలయాలను కూడా  నిర్మించడం జరిగింది.


ఈ ఏడాది ఫిబ్రవరిలో శ్రీకాళహస్తీశ్వరాలయం నిత్యాన్నదాన పథకానికి ఓ దాత భారీ విరాళం అందజేసి, తన గొప్ప మనసు చాటుకున్న విషయం కూడా అందరికి తెలిసిందే. శ్రీకాళహస్తి పాత వరదయ్యపాళెం రోడ్డులో నివాసముంటోన్న యు.సుబ్రహ్మణ్యం, రాధిక దంపతులు రూ.1,11,11,112 విరాళంగా ఇచ్చారు. తల్లిదండ్రులు వెంకటసుబ్బయ్య, రామలక్ష్మమ్మ జ్ఞాపకార్థం ఈ విరాళం అందజేస్తున్నట్లు సుబ్రమణ్యం తెలిపారు. ఈ మొత్తానికి సంబంధించిన చెక్కును ఆలయ ఈవోకు అందచేయడం జరిగింది. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ గా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: