విజయనగరం జిల్లాలో పైడితల్లిఅమ్మవారి జాతరలో సిరిమాను సంబరం కీలకమైన ఘట్టం. సిరిమానోత్సవం ఆద్యంతం వీనుల విందుగా సాగుతుంది. ఈ సిరిమాను ఉత్సవానికి అసంఖ్యాకమైన భక్తులు వస్తుంటారు. ప్రతీ సంవత్సరం ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య వేలల్లో పెరుగుతోంది. ఉత్తరాంధ్రులు ఇలవేలుపు విజయనగరం పైడితల్లి అమ్మవారి ఉత్సవాల్లో సిరిమానోత్సవం ప్రధాన ఘట్టం. ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు లక్షలాదిగా భక్తులు తరలివచ్చి సిరిమాను రూపంలో ఉన్న పైడిమాంబను దర్శించుకుంటారు. పేరుకి గ్రామ దేవతే అయినా ఆ తల్లి కీర్తి మండలాలు, పట్టణాలు జిల్లాలు దాటి విశ్వవ్యాప్తమైంది. పైడితల్లి మహిమ గురించి ఎక్కడెక్కడ వాళ్లో తెలుసుకుని మరీ సిరిమానను, సంబరం రోజున వ్యవప్రయాసల కోర్చి మరీ వస్తుంటటారు. మంగళవారం  ఘనంగా ప్రారంభమైన పైడితల్లి అమ్మవారి జాతర అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన  పూసపాటి రాజ వంశీయులు జాతర ప్రారంభించారు. మాన్సస్ ట్రస్ట్ ఛైర్మన్, మాజీ కేంద్రమంత్రి, మాజీ ఎంపీ అశోక్ గజపతి రాజు కుమార్తె అదితి గజపతి రాజు పైడితల్లి అమ్మవారి వేడుకలను కన్నుల పండువగా నిర్వహిస్తున్నారు.  అమ్మవారి జాతరలో ప్రధాన ఘట్టం సిరిమానోత్సవం.


ఏటా ఈ ఉత్సవం ముగిసే సమయానికి సమయం మించిపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఏడాది మాత్రం ముందే ముగిసేలా చర్యలు చేపట్టారు. సిరిమానును ఉదయం 11 గంటలకే ఆలయానికి తీసుకొచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. తొలేళ్ల ఉత్సవం ఉదయం నుంచి పండగ సందడి నెలకొంటుంది. బంధువులు, స్నేహితులతో ప్రతీ ఇల్లూ కళకళలాడుతుంది. సంప్రదాయం ప్రకారం తోలేళ్ల ఉత్సవం రోజు ఉదయం ఆలయ ధర్మకర్తలు పూసపాటి అశోక్‌గజపతిరాజు కుటుంబసమేతంగా ఆలయానికి వచ్చి తన పుట్టింటి ఆడపడుచుకు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఉదయం 6 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతించారు. ఇక, సిరిమాను సంబరాల్లో విచిత్ర వేషాలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచేవారు తెల్లని వస్త్రాలు కట్టుకుని అమ్మవారిని దర్శించుకుంటున్నారు.




రాత్రి 9 గంటలకు హుకుంపేట నుంచి ఘటాలు ఆలయానికి వస్తాయి.మేళతాళాలతో ఘటాలను ఊరేగింపుగా అమ్మవారి పుట్టిల్లు కోటకు తరలిస్తారు. రాజవంశీయుల అర్చనలు అనంతరం ఘటాలను తిరిగి ఆలయానికి తీసుకొస్తారు. ఆలయ ఆవరణలో సంప్రదాయ కళారూపం తూర్పుభాగవతం ప్రదర్శిస్తారు. పట్టణంలో పలు ప్రాంతాల్లో ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. సిరిమానును అమ్మవారిగా ఆరాధించే ఉత్సవానికి ముందురోజు తొలేళ్లు నిర్వహిస్తారు. తొలి ఏరే తొలేళ్లుగా మారింది. ఏరు అంటే నాగలి. తొలేళ్ల నాడు రాత్రి ప్రధాన పూజారి బంటుపల్లి వెంకటరావు రైతులకు విత్తనాలు అందజేస్తారు. వాటిని పొలాల్లో జల్లి నాగలితో భూమాతను పూజిస్తే సమృద్ధిగా పంటలు పండుతాయని విశ్వాసం. ఇది తరతరాలుగా వస్తున్న సంప్రదాయం.



మరింత సమాచారం తెలుసుకోండి: