సాధారణంగా  వివాహం మరియు పుట్టినరోజు, నామకరణం సందర్భాలలో కానుకలు, బహుమతులు ఇవ్వడం చూస్తూ ఉంటాం. అలాగే   ఏదైనా పండుగకూ లేదా ఇతర కార్యక్రమాలకు సంబంధించి చాలా మంది వారి స్నేహితులకు, బంధువులకు, ప్రేమికులకు బహుమతులు ఇస్తూ ఉంటారు. అదేవిధంగా వారు కూడా ఎన్నో బహుమతులను స్వీకరిస్తుంటారు. ఈ గిఫ్ట్ లు గురించి ఒకసారి పరిశీలిస్తే ఇది ప్రాచీన కాలం నుండి వచ్చిన సంప్రదాయం.  


డ్రె ౖఫ్రూట్స్‌, స్వీట్లు, టపాసులు, ఆభరణాలు.. ఇలా విభిన్న రకాల బహుమతులను ఇచ్చి పుచ్చుకోవచ్చు. ఇంకాస్త వైవిధ్యంగా ఉండాలనుకుంటే చాక్లెట్లు, బంగారం నాణెలు, డ్రెస్‌లు, క్యాండిల్స్‌, పెన్‌ హోల్డర్లులాంటివి బహుమతిగా ఇవ్వొచ్చు.  ప్రమిదలా.. క్యాండిల్సా..!సంప్రదాయవాదులు ప్రమిదలలో ఒత్తులు వేసి దీపాలు పెట్టాలనుకుంటారు. ఆధునికవాదులు క్యాండిల్స్‌ వెలిగిస్తారు. ఏదైతేనేం దీపాలు పెట్టడమే ముఖ్యమన్నది ఎక్కువమంది వాదన.

దీపకాంతుల పండుగ వేళ ఆ దీపాలు వైవిధ్యంగా కనిపించాలంటే.. డిజైనర్‌ దియా లేదంటే క్యాండిల్స్‌ ఇంటికి తెచ్చుకోవడమే. ఇటీవలి కాలంలో కొంతమంది ఓ అడుగు ముందుకేసి పేపర్‌ లైట్‌ లాంట్రిన్స్‌ కూడా వెలిగిస్తున్నారు. 
 అలంకరణ.. రొటీన్‌గా కాదు..దీపావళి వేళ ఇంటిని అందంగా అలంకరించుకోవడం ఓ కళ. ఫలానా కమ్యూనిటీ వాళ్లు అందంగా డెకరేట్‌ చేసుకుంటారనే బదులు మీరు కూడా ట్రై చేయొచ్చు. ఆన్‌లైన్‌లో బోలెడు ఆప్షన్స్‌ అందుబాటులో లభిస్తున్నాయిప్పుడు. అలంకరించిన తర్వాత ఎలా ఉంటుందో అనే సందేహించాల్సిన అవసరం లేకుండా చిత్రాలు కూడా ఉంటాయి. సో మనకు నచ్చింది ఎంచుకోవచ్చు. 

పూజా తాలీ కూడా.సంప్రదాయాలను అనుసరించడం నవతరానికి కాస్త ఇబ్బందే. పూజ దగ్గర ఏం ఉండాలి.. ఎలా చేయాలి అనే సందేహాలకు చెక్‌ పెడుతూ ఆన్‌లైన్‌లో అన్నీ దొరుకుతున్నాయిప్పుడు. పూజా సామగ్రి ప్యాక్‌తో సహా. దీపావళి వేళ అవసరమైన పూజా సామగ్రితో దివాలీ పూజా తాలీ అంటూ ఆన్‌లైన్‌లో విక్రయాలు జరుపుతున్నారు. అలంకరణ ఉండాల్సిందేగా...ఇటీవలి కాలంలో పండగ ఏదైనా విద్యుత్‌ కాంతులు ఉండాల్సిందే అంటున్నారు చాలామంది. ఆన్‌లైన్‌లో విభిన్న రకాల అలంకరణ విద్యుత్‌ దీపాలు లభ్యమవుతున్నాయి. కొన్ని అయితే దియాల్లాగానే వెలుగుతుంటాయి కాబట్టి ఓ సారి ట్రై చేయండి.


మరింత సమాచారం తెలుసుకోండి: