మహాభారతంలో శ్రీకృష్ణుడు ఎప్పుడూ ఒక నెమలి ఈకను తన తలలో అలంకారంగా ధరించేవాడు. అంతేకాదు, పరమశివుని కుమారుడయిన సుభ్రమణ్యుడు నెమలిని తన వాహనంగా ఉపయోగిస్తాడు. అయితే శ్రీ‌కృష్ణుడు త‌ల‌పై నెమ‌లి పించాన్ని ఎందుకు ధ‌రిస్తాడు? అన్న ప్ర‌శ్న చాలా మందికి వ‌చ్చే ఉంటుంది. మ‌రి ఈ ప్ర‌శ్న‌కు స‌మాదానం ఇప్పుడు తెలుసుకుందాం.. కృష్ణుడు అంటేనే లీలలు. కృష్ణుడు ఎప్పుడు నెమలిపించం ధరించకుండా కనబడడు.


ఈ స‌మ‌స్త సృష్టిలో సంభోగం చేయ‌కుండా  సంతానం పొందగలిగేది ఒక్క నెమలి మాత్రమే. వాస్త‌వానికి మగనెమలికి పించం ఉంటుంది. వర్షాకాలంలో గంభీరంగా ఉరుముతున్నప్పుడు పులకించిన మగనెమలి నాట్యం చేసినపుడు కంటి నుండి ఆనంద భాష్పాలు రాలుతాయి.ఆ సమయంలో మగనెమలి కంటి నుంచి పడే బిందువులను ఆడనెమలి వచ్చి త్రాగుతుంది. ఆ నీటిని త్రాగడం ద్వారా ఆడనెమలి సంతాన భాగ్యాన్ని పొంది గర్భం ధరిస్తుందట. ఎటువంటి శారీరిక సంబంధం లేకుండా జరుగుతుంది ఈ ప్రక్రియ.


ఇక శ్రీ కృష్ణుని పదహారు వేల మంది గోపికలు. అన్ని వేల మంది భామలతో  శ్రీ కృష్ణుడు సరససల్లాపాలు మాత్రమే చేశాడు.  అల్లరి చేసి ఆడాడు. అంతవరకే మెలిగాడు. అయితే శ్రీ కృష్ణుడు తనకు అందరితో ఉన్నది ఆత్మ సంబంధమేనని, ఎవరితోనూ తనకు శారీరిక సంబంధం లేదని, తాను ఒక యోగినని తెలుపడానికే నెమలి పించం ధరించి కనిపిస్తాడు అని శాస్త్రం చెబుతోంది. ఇక‌ నెమలి అంత పవిత్రమైన‌ది కనుకే మన జాతీయపక్షి అయింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: