భారత దేశంలో ఎన్నో పండుగలుంటాయి వాటిలో కొన్ని ఒకరోజు కంటే ఎక్కువే జరుపుకుంటారు. నవరాత్రి, దీపావళి లాంటివి ఈ కోవలోకే వస్తాయి. ఈ పండుగలని అందరూ ఎంతో ఉత్సాహంగా సంతోషంతో జరుపుకుంటారు.ఆ సంవత్సరంలో పడ్డ బాధలూ, కష్టాలూ అన్నీ మర్చిపోయి బంధుమిత్రులతో ఈ పండుగలని సంతోషంగా జరుపుకుంటారు.ధన త్రయోదశితో మొదలయ్యే హిందువుల ముఖ్య పండుగ అయిన దీపావళి ఐదు రోజుల పండుగ. కృష్ణ పక్షంలో పదమూడవరోజున అక్టోబరు-నవంబరు లో వచ్చే కార్తీక మాసం వచ్చే ఈ త్రయోదశి దీపావళి మొదలవుతుంది.పదిహేనవ రోజు అమావాశ్య రోజున దీపావళి జరుపుకుంటారు. ఈ త్రయోదశి రోజున మీరందరూ కొత్త నగలూ లేదా ఏమైనా లోహాలూ కొనుక్కుంటారు కదా.


ముఖ్యంగా ఈరోజున బంగారం లేదా వెండి కొనడానికి ప్రజలు ఆసక్తి చూపిస్తారు. అసలు ఈరోజున బంగారం ఎందుకు కొనాలని ఎప్పుడైనా ఆలోచించారా..?. అసలు ఈ త్రయోదశి విశిష్టత తెలుసా??ప్రతీ పండగ వెనుక ఉన్న పరమార్ధాన్ని తెలుసుకుంటే కనుక ఆ పండగని మరింత శ్రద్ధాశక్తులతో జరుపుకోగలము.ఇక ఈ త్రయోదశి విశిష్టత తెలుసుకుందామా??దీపావళి షాపింగుకి బయలుదేరేముందు ధన త్రయోదశి విశిష్టత తెలుసుకోండి. ధన్‌తేరస్ అని కూడా వ్యవహరిస్తారు ధన త్రయోదశిని. అనగా సంపద అని అర్ధం.చాలా మంది ఈరోజున తమ కుటుంబం సుఖ సంతోషాలూ, అష్టైశ్వర్యాలతో ఉండాలని లక్ష్మీ దేవినీ, గణపతినీ పూజిస్తారు.బంగారం, వెండిని కూడా మంగళప్రదంగా భావించి ఈ లోహాలని కూడా పూజిస్తారు. లక్ష్మీ దేవికి స్వాగతం-సంపదకి గుర్తు లక్ష్మీ దేవి.అందుకే ఈరోజున అందరూ కొత్త వస్తువులనీ, నగలనీ, వెండి వస్తువులనీ కొంటారు.వీటిని కొనడంద్వారా లక్ష్మీ దేవిని ఇంట్లోకి ఆహ్వానించి ఇల్లు సంపదలతో తులతూగాలని కోరుకుంటారు.



యమ దీపం కధ-హీమ రాజు కుమారుడు పెళ్లయ్యిన నాలుగో రోజున పాము కాటుతో మరణిస్తాడని అతని జాతకంలో రాసి పెట్టి ఉంది.తన భర్తని కాపాడుకోవటానికి ఆ యువరాజు భార్య ఆరోజు భర్తని నిద్ర పోనీయకుండా మెలకువతో ఉంచి, గది నిండా బంగారం, వెండి నాణాలు కుప్ప పోసి, మరో పక్కన దీపాలు వెలిగించి భక్తితో పాటలు పాడుతూ ఉంది. యువరాజు ప్రాణాలు తీసుకెళ్లడానికి వచ్చిన యమ ధర్మ రాజుకి నాణేల కాంతి, దీపాల కాంతిలో ఏమీ కనపడదు.అందువల్ల ఆయన వెనుదిరిగివెళ్ళిపోతాడు.తెలివైన ఆ యువరాజు భార్య అలా ధన త్రయోదశి రోజున తన భర్త ప్రాణాలని కాపాడుగోగలిగింది.అందువల్ల ఆరోజు నుండీ ధన త్రయోదశిరోజున రాత్రంతా యమ ధర్మరాజుకి గౌరవ సూచకంగా దీపాలు పెడతారు.
అమృత మధనం కధ- దేవ దానవులు క్షీర సాగర మధనం చేసినప్పుడు ధనత్రయోదశి రోజున క్షీర సాగరం నుండి అమృతం బయటపడింది. అందువల్ల ధన త్రయోదశి నిష్టతో జరుపుకుంటే దీర్ఘాయుష్షు లభిస్తుంది.




కుబేరుని పూజ-యక్షుడైన కుబేరుడు సంపదకి అధిపతి.ఈ రోజున కుబేరుణ్ణి పూజిస్తే మీ సంపద పెరగడమే కాకుండా మీ సంపద కుబేరుని ఆశీస్సుల వల్ల రక్షింపబడుతుంది కూడా. పార్వతీ దేవి కధ-ధన త్రయోదశిని అల్లుకుని ఉన్న మరోక కదేమిటంటే తన పతితో పాచికలాడిన పార్వతీ దేవి మీద పరమ శివుడు విజయం సాధించాడు. ఈరోజున కనుక పాచికలూ,జూదం లాంటివి ఆడితే మీ సంపద రెట్టింపవుతుందని కూడా ఒక నమ్మకం. ఇప్పుడు తెలిసిందా ధన త్రయోదశి యొక్క విశిష్టత??దీపావళి ముందు వచ్చే ఈ పండుగ భారత దేశంలో చాలా ముఖ్యమయినది.ఈరోజున కనీసం కొంచెం బంగారం లేదా వెండి కొంటారు.ఒక వేళ అవి కొనలేక పోతే కొత్త పాత్రలు కొని లక్ష్మీ దేవినీ, గణపతినీ పూజిస్తారు.



మరింత సమాచారం తెలుసుకోండి: