రెండేళ్ల క్రితం 'దీపోత్సవం' పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ దీపాలను వెలిగించే కార్యక్రమం మొదలుపెట్టింది. ఏటేటా దీపాల సంఖ్యను పెంచుతూ వస్తున్నారు. ఈసారి ఐదున్నర లక్షల దీపాలను వెలిగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. శనివారం అంతా ప్రణాళిక ప్రకారం జరిగితే, ఈ కార్యక్రమానికి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌‌లో స్థానం దక్కుతుంది.


సరయూ నది ఒడ్డుపై కట్టిన 'రామ్ కీ పౌడీ' ఈ దీపోత్సవానికి వేదిక. ఇక్కడ ఏ దిక్కున చూసినా దీపాలే కనిపిస్తున్నాయి.మెడలో వాలంటీర్ కార్డులు వేసుకున్న చాలా మంది దీపాలను సర్దే పనిలో నిమగ్నమయ్యారు. కొందరు నేలపై కూర్చొని దీపాలను పూల ఆకృతుల్లో పేర్చుతున్నారు. ఇంకొందరు స్టీల్ ఫ్రేముల్లో అమర్చుతున్నారు.
వాడి వికలాంగ్ సేవా సంస్థాన్ అనే స్వచ్ఛంద సంస్థ నుంచి వచ్చిన ఇలా శుక్లా అనే కార్యకర్త ఈ ఏర్పాట్లలో పాలుపంచుకుంటున్నందుకు సంతోషంగా కనిపించారు.

తమ సంస్థ నుంచి దాదాపు 30 మంది ఇక్కడికి వచ్చినట్లు ఆమె చెప్పారు.మెట్లపై అట్టముక్కలతో ఏర్పాటు చేసిన ఏనుగులు, గుర్రాలు, ఒంటెల బొమ్మలకు కొందరు స్థానిక పెయింటర్లు రంగులు అద్దుతున్నారు.మోతిహారి ఆలయం సమీపంలో బిహార్ నుంచి వచ్చిన అజయ్ కుమార్ ఝా బీబీసీ బృందానికి కలిశారు. కార్తీక మాసం అంతా తాను అయోధ్యలోనే ఉంటానని ఆయన చెప్పారు.


దీపోత్సవం ఘనంగా జరుగుతుందని విన్నామని, దాన్ని చూడాలని ముందే అయోధ్యకు వచ్చామని ఆయన వివరించారు. రామాయణంలోని అనేక ఘట్టాలను ప్రదర్శించేందుకు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. వీటిలో ఓ ప్రదర్శన కోసం రాముడు, సీత పాత్రదారులు హెలికాప్టర్‌లో కిందకి రానున్నారు. ఆ తర్వాత హారతి, దీపాలను వెలిగించే కార్యక్రమాలు జరగనున్నాయి.రామ్ కీ పౌడీకి ఒక ఒడ్డున రామాయణ ఘట్టాల ప్రదర్శన సాగుతోంది. ఇక్కడి నుంచి 500-700 మీటర్ల దూరంలో అయోధ్య నగరం ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: