ఈ ప్రపంచాన్ని ఏదోశక్తి నడిపిస్తున్నది అన్న విషయం అందరికి తెలిసిందే. ఆ శక్తి ఏంటో తెలుసుకోవాలని ఇప్పటివరకు ఎందరో ప్రయత్నించారు. ప్రయత్నిస్తున్నారు కూడా. కాని వారు తెలుసుకునే విషయాలకు సైన్స్ అనే పదానికి ముడి పెడుతున్నారు. కాని ఈ ప్రపంచంలో సైన్స్ కూడా అందుకోలోని ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. ఇలాంటివి ఎంతగా శోధించిన అంతుచిక్కవు. సమయం వృదా అవ్వడం  తప్పా ! ఇకపోతే ఈ సృష్టి అంతా భగవంతుని ప్రేమమయంతో నిండుకొని ఉన్నది. ఆ ప్రేమ అనే పదంలోకి సేవ అనే భావం కూడ వస్తుంది.ఒక వ్యక్తికి సేవ చేయాలంటే అతని పట్ల సేవచేసే వారికి ప్రేమ కలగాలి ఇది మనషులకు సంబంధించిన విషయం. కాని పూర్తి సేవగురించి తెలుసుకుంటే అద్భుతం అనిపిస్తుంది.


ఇకపోతే మనం "సేవ" అనే పదానికి నిస్వార్ధంగా ఇతరులుకి సహాయపడటం అనే అర్ధం చెపుతాము. కానీ దాస్య భక్తిలోని  సేవ ఇంకా ఉన్నతమైనది. ఎందుకనగా ఈ మార్గంలో భక్తుడు స్వతంత్రంగా ఏ నిర్ణయాలు తీసుకోడు, కేవలం భగవంతుని గానీ, జ్ఞానులు గానీ ఆజ్ఞాపించిన విధంగా తనని తాను సమర్పణ చేసుకుంటాడు. ఈ మార్గంలో భక్తుడు సదా భగవంతునికి ఏదో ఒక సేవ చేస్తూనే ఉంటాడు. అదే అతని జీవిత పరమావధిగా భావిస్తాడు. ఎలాంటి ప్రతిఫలాపేక్షను ఆశించకుండా ప్రేమతో , భక్తితో నిస్వార్ధంగా అవసరమైన సమయంలో పరిచర్యలు చేయడాన్ని దాస్యం అంటారు..


భగవంతుని ఆదేశాలను పాటిస్తూ ఉపదేశాలను అనుసరిస్తూ దైవకార్యానికి జీవితాన్ని వినియోగించడమే దాస్య భక్తి. ఈ భక్తిలో నేను , నాది అన్న మాటలకు చోటు ఉండదు. జగమే సర్వం విష్ణుమయం అంటూ "జీవితమే సర్వం సాయి మయం " అనుకుంటూ జీవితం సాగించటం, "అహం" వీడి మనకు చెందేదేమీ లేదని భావించటం , తను భగవంతుని సేవకుడని భావిస్తూ  సపర్యలు చేయడం దాస్య భక్తి క్రిందికి వస్తాయి. ఈ విధంగా మానసిక పరిణితి చెందిన సాధకుడు సర్వజీవులలోను అంతర్యామిగానున్న భగవంతునికి తాను దాసుడననే భావం పెంపొందిచుకుంటాడు. దాస్యభక్తికి ఉత్తమోత్తమమైన ఉదాహరణ హనుమంతుడు. హనుమంతుడు..


ఏనాడూ రాముడిని ఏ భౌతికమైన కోరికలు కోరలేదు. అతనిది స్వార్ధం లేని జీవనం, ఏ ప్రయోజనం ఆశించని భక్తి. రాముడే జీవితం, రామనామమే శ్వాస, రామ కార్యం సాధంచటమే అతని లక్ష్యం. సముద్రం దాటుతున్నప్పుడు మైనాక పర్వతం కొంచెం సేద తీసుకోమని కోరినప్పుడు రామకార్యం పూర్తయ్యే వరకూ విశ్రాంతి తీసుకోను అని తన దాస్య భక్తిని ప్రకటించుకున్నాడు హనుమంతుడు. రావణుని సభలో నీవెవరిని ప్రశ్నించగా  "దాసోహం కౌసలేంద్రస్య" అన్నాడు హనుమంతుడు.


అంటే తన పరిచయం ఎలా ఇచ్చాడో చూడండి " నేను శ్రీ రామ దాసుడను" అని గర్వంగా చెప్పుకున్న దాసుడు. రాముడు ఏది చెప్పినా కాదు , లేదు అనకుండా తన భక్తిని రాముని పైన చూపించాడు. రాముడే సర్వస్వంగా భావించి ధన్యుడైనాడు హనుమంతుడు. ఇదే నిజమైన సేవ, భక్తి,  దాస్య భక్తి  అంటారు. మరి ఈ కాలంలో ఇవన్ని ఎక్కడ కనిపిస్తున్నాయి. గాలి కలుషితమైనట్లుగా మనుషులు కూడ కలుషితమైపోయారు. స్వార్ధంతో బ్రతకడం నేర్చుకున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: