అరటి,  రావి,  మోదుగ,  మర్రి,  వంటి  పచ్చటి  చెట్ల  ఆకుల్లో  భోజనం  అన్ని  రకాలుగా  శుభకరము,  ఆరోగ్యకరము  అని    ఆయుర్వేదం  చెబుతోంది. ఆరోగ్య  శాస్త్రాలు,  పురాతన  శాస్త్రాలు  అనుసరించి,  అరటి ఆకులలో  భోజనం  ఉత్తమమని  తెలుపుతున్నాయి,  చెట్ల  ఆకుల్లో  ఔషధ  గుణాలుంటాయి,  అవి  శరీరానికి  ప్రత్యేకంగా,  కానీ  పరోక్షంగా  ఎంతో  మేలు  చేస్తాయి. రావి  ఆకులో  భోజనం  చేస్తే  జననేంద్రియ  దోషాలు  పోతాయి  చిన్న  పిల్లలకు  చక్కటి  మాటలు  వస్తాయి, మోదుగ  విస్తరిలో  భుజిస్తే  నేత్ర  దోషాలు  తొలగుతాయి. ఇప్పటికీ  గ్రామీణ  ప్రాంతాల్లో  ఉగాది  రోజున  చేసే  భక్షాలను  మోదుగ  ఆకులో  తినడం  ఆనవాయితీగా  వస్తోంది. మర్రి  ఆకులతో  కుట్టిన  విస్తరిలో  భోజనం  చేస్తే  పూర్తి  ఆరోగ్యం   సిద్ధిస్తుంది. 


అందుకే  దేవతలకు  పెట్టె  నైవేద్యాన్ని  మర్రి  ఆకుల  విస్తరిలో  నివేదించడం  జరుగుతుంది. పచ్చటి  ఆకుల్లో  భోజనం  చేస్తే  ఆకుల్లోని  క్లోరోఫిల్  ఉండడం  వలన  అనేక  రుగ్మతలు,  పేగుల్లోని  క్రిములు  దూరమవుతాయి. ఈ  విషయాలను  గమనించిన  మన  పూర్వీకులు  అప్పట్లోనే  శాస్త్రీయ  పద్దతులను  అనుసరించి,   పచ్చన  చెట్లు  మద్య  కార్తీక  మాసంలో  ఒక   నెల రోజుల  పాటు   వనభోజనాలు  చేయడం  మంచిదని  తెలిపారు, మనం  కనీసం   ఒక  రోజు అయినా  భోజనాలు చేసి ఆరోగ్యన్ని  కాపాడుకుందాం.



కార్తీక మాసం అనగానే దీపారాధనకు ఎంత ప్రాధాన్యతను ఇస్తారో భోజ ప్రక్రియకు కూడా అంతే ప్రాధాన్యతను అందిస్తున్నారు. సంస్కృతి,  ఆచారాలను  పరిరక్షించుకునే క్రమంలో హై టెక్ సిటీల్లో సైతం  వన  భోజనాలను నిర్వ్హఅహినుకోవడం ముదాహం. ఇందుకు మహా నగరాల్లో జరుగుతున్నా సామూహిక భోజనాలనే నిదర్శనం.   యమా ధరమ రాజు సైతం ఈ భోజనము ఆచారాన్ని తూచా తప్పకుండా ఆచరిస్తూ వస్తున్నారని పురాణం ఇతిహాసాలు సూచిస్తున్నాయి. విదియ నాడు భగినీ హస్త భోజనము  లేక. అన్నా చెల్లెలు  పండుగ అంటారు. దీనిని  29-10-2019 మంగళవారం జరుపుకున్నారు. 
 
.



మరింత సమాచారం తెలుసుకోండి: