హారర్ అనగానే మనకు గుర్తుకు వచ్చేది. సినిమాలలో చూపించే.. దట్టమైన అడవి మార్గంలో ప్రయాణిస్తుంటే హఠాత్తుగా భారీ వర్షం వచ్చి మార్గమధ్యంలో కారు చెడిపోవడం, అందులో ప్రయాణిస్తున్న నలుగురైదుగురు మిత్రులు ఆ రాత్రికి ఆశ్రయం వెతుకుతుంటారు. అంతలో దూరంలో ఓ పాడు పడిన బంగ్లా కనిపించడం అక్కడికి వెళ్లి రాత్రికి తలదాచుకోవటం.. ఆ రాత్రికి అక్కడే భయం భయంగా పడుకోవడానికి ప్రయత్నించడం, అర్ధరాత్రి దాటాక భూత, ప్రేత, పిశాచాల అరుపులు, కేకలు వినిపించడం... వంటివి చూసుంటాం.. కానీ ఇది నిజంగానే ఉంటే.. దాన్ని మనం అనుభవిస్తే ఆ థ్రిల్లింగ్ ఎలా ఉంటుందో ఊహించుకోండి.  


ఎలా అనుభవిస్తాము.. మనకు ఎలా దొరుకుతాయి అనుకుంటున్నారా..! అయితే రండి..చదవండి. అమెరికాలోని టెన్నెస్సీ నగరంలో ‘మ్యాక్‌ కామే మానర్‌’ పేరిట ఓ ‘హారర్‌ హౌజ్‌’ను ఏర్పాటు చేశారు. అందులోకి వెళ్లి పది గంటలు గడిపి వచ్చిన వాళ్లకు 20 వేల డాలర్లు ( 14,20,000 రూపాయలు) బహుమతిగా అందజేస్తామని ‘మాక్‌ కామే మానర్‌’ యజమాని రస్‌ మాక్‌ కామే సవాల్‌ చేస్తున్నారు. ఇందులోకి  చాలా షరతులు ఉన్నాయి. 


21 ఏళ్ళ వయస్సు, సంపూర్ణ ఆరోగ్యం, శారీరకంగా, మానసికంగా బలిష్టంగా ఉన్న వైద్యుడి సర్టిఫికెట్‌ ఉండాలి. ఆరోగ్య బీమా తప్పనిసరిగా ఉండాలి. వచ్చాక కూడా హారర్‌ హౌజ్‌ నిర్వాహకులు సొంత వైద్యుల చేత ‘ఫిట్‌నెస్‌’ పరీక్షలు చేయిస్తారు. అందులో పాస్‌ కావాలి. ఓ డ్రగ్‌ పరీక్ష కూడా నిర్వహిస్తారు. దాన్ని కూడా తట్టుకోవాలి. ముందుగానే వీడియోల ద్వారా చూపిస్తారు లోపలికి వెళితే ఏం జరుగుతుందో..


ముందుగా  అందులోకి వెళ్లిన వారి అనుభవాలను కూడా చూపిస్తారు. ఆ తర్వాతనే ధైర్యం చెప్పి లోపలికి పంపిస్తారు. కొన్నేళ్లుగా ఈ హారర్‌ హౌజ్‌ను నిర్వహిస్తున్నా.. ఇంతవరకు ఎవరు కూడా పది గంటల పాటు ఆ ఇంట్లో గడిపి వచ్చిన వారు లేరట.., 20 వేల డాలర్లు అందుకున్న వారు లేరని రస్‌ మాక్‌ కామే తెలిపారు. ఇందులో వెళ్లి వచ్చిన వారికి ఎక్కడా చిన్న గాయం కూడా కాదని గ్యారంటీ కూడా ఇస్తున్నామని ఆయన చెప్పారు. మధ్యలోనే భయపడి బయటకు రావాలని కోరుకుంటున్న వారు నోటితో చెప్పినా, సైగలు చేసినా సురక్షితంగా భయటకు తీసుకొస్తామని ఆయన తెలిపారు. మరి మీరు కూడా అనుభూతులను, అనుభవాలను పొందాలనుకుంటే ఆలస్యం ఎందుకు మరి వెళ్ళండి. 



మరింత సమాచారం తెలుసుకోండి: