దేశ రాజకీయ, సామాజిక అంశాలను తీవ్రంగా ప్రభావితం చేసి, 134 ఏళ్లపాటు కొనసాగిన అయోధ్య వివాదానికి సుప్రీంకోర్టు తీర్పుతో ఎట్టకేలకు తెరపడింది. ఈ నెల 9న అంతిమ తీర్పును వెలువరించింది. అయితే ఈ తీర్పు కోసం దేశ ప్రజలందరూ ఎంతో ఉత్కంఠంగా ఎదురుచూశారు. ఎందుకంటే ఈ వివాదం ఇప్పటిది కాదు ఎన్నో ఏళ్ళ నుండి ఈ వివాదం కొనసాగుతుంది. 


ఏమైతేనేం... అయోధ్య కేసు చివరికి సుకాంతం అయ్యింది. ఇంకా విషయానికి వస్తే.. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌కు చెందిన ఉర్మిళా చతుర్వేది అనే 81 ఏళ్ల సంస్కృత ఉపాధ్యాయురాలు అయోధ్య తీర్పు కోసం ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం ఏంటంటే అయోధ్యలో భవ్యమైన రామమందిర నిర్మాణం కోసం నిర్ణయం జరిగేదాకా పాలు, పళ్లు మాత్రమే తింటానని దీక్ష పూనింది. 


అయితే ఆ కిష ఒక్క రోజు, రెండు రోజులు, వారం, నెల కాదు.. ఒక సంవత్సరం కూడా కాదు. దాదాపు 27 ఏళ్ల నుంచి ఆమె ఈ దీక్ష పూనింది. పరమ భక్తురాలైన ఆమెను 1992 డిసెంబర్ 6న అయోధ్యలో బాబ్రీ మసీదును కరసేవకులు కూల్చివేయడం.. అనంతరం చెలరేగిన అల్లర్లు కలిచివేశాయి. దీంతో ఆరోజు నుంచి ఆమె రామ మందిర నిర్మాణానికి మార్గం సుగమం అయ్యేదాకా ఆమె ఉపవాసం ఉండాలని దీక్ష తీసుకుంది. 


అయితే దీక్ష చేపట్టినప్పుడు ఆమెకు 54ఏళ్ల వయసు. ఇప్పుడు 81 ఏళ్ళు వచ్చాయి. అయినప్పటికీ ఆమె రామ మందిరం కోసం ఇంకా ఉపవాసంలోనే ఉన్నారు. అయితే ఇప్పుడు అయోధ్య వివాదాన్ని పరిష్కరిస్తూ సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వడంతో ఊర్మిళ తిరిగి సాధారణ ఆహారం తీసుకునేందుకు సిద్ధమయ్యారు. త్వరలోనే ఆమె దీక్ష విరమణ ఉద్యాపన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఆమె తనయుడు చెప్పాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: