శ్రీరాముడు హిందువుల దైవం. హనుమ ఆయన దాసుడు. రామాలయమో? హనుమాలయమో? లేని గ్రామం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కనిపించదు. ఆ రాముని జన్మస్థలం అయోధ్య అందుకే ఆయన అయోధ్య రాముడుగా చిరపరిచితం. అయితే సహస్రాబ్ధాల రామజన్మభూమి వివాదాల నుండి నేడు బయటపడింది. అయోధ్యలోని వివాదాస్పద 2.77 ఎకరాలస్థలం హిందువులకే చెందుతుందని దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు చారిత్రాత్మక తీర్పు వెల్లడించడంతో రామమందిర నిర్మాణానికి ఆటంకాలు తొలగిపోయాయి. త్వరలో రామజన్మభూమిలో రామాలయ నిర్మాణానికి భూమిపూజ నిర్వహించనున్నారు.


తిరుమల తీరున అయోధ్యను ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సంకల్పించాయి. అయోధ్యలో ఆలయాన్ని నాలుగేళ్లలో పూర్తిచేయాలని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో అయోధ్యకి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో అయోధ్య పట్టణం నగర రూపు రేఖలు సంతరించుకో బోతుంది. ఇందుకు అధికారులు నూతన  ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఫైవ్‌స్టార్ హోటల్స్, రిసార్ట్స్, అంతర్జాతీయ ప్రమాణాలతో బస్టాండ్ మరియు ఎయిర్‌పోర్ట్‌ లను నిర్మించనున్నారు. 'అయోధ్య తీర్థ పరిషత్‌' ను ఏర్పాటు చేసి 'తిరుమల తిరుపై దేవస్థానం' కు ధీటుగా తీర్చిదిద్దుతామని అధికారులు పేర్కొంటున్నారు. సరయూ నదిలో విహారానికి ఏర్పాట్లు చేయనున్నట్టు తెలిపారు. సరయూ నదిపై క్రూయిజ్‌ను (జలవిహారం) ప్రారంభించేందుకు ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం సన్నద్ధమవుతున్నదని అయోధ్య డివిజన్‌ సమాచార డిప్యూటీ డైరెక్టర్‌ మురళీధర్‌ సింగ్‌ అభివృద్ధి ప్రణాళికలను బుధవారం వివరించారు.
Image result for <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=AYODHYA' target='_blank' title='ayodhya-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ayodhya</a> is getting the shapes of a spiritual city
అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్ నిర్మాణం త్వరలోనే ప్రారంభించి 2020 శ్రీరామనవమికి విమానాల రాకపోకలు సాగించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. అలాగే, ఫైజాబాద్-అయోధ్య మధ్య ఐదు కిలోమీటర్ల పొడవైన ఫ్లై-ఓవర్ నిర్మాణ పనులు చేపడతారు. డిసెంబరులోగా 10 రిసార్టులు, ఒక ఫైవ్‌-స్టార్ హోటల్ పూర్తిచేయనున్నారు. అంతేకాదు, అయోధ్యలోని రామాలయం దేశంలోనే అతిపెద్ద దేవాలయంగా తీర్చిదిద్దుతామని రోజుకు 2000 మంది శిల్పులు శ్రమించి రెండున్నరేళ్ల లో దీని నిర్మాణం పూర్తిచేయనున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే 65 శాతం శిల్పాలను చెక్కినట్లు తెలిపారు. 2.77 ఎకరాల ఆలయ ప్రాంగణంలో గోశాల, ధర్మశాల, వేదిక్‌ సంస్థను ఏర్పాటుచేయనున్నట్లు వివరించారు. 10 శ్రీరామ ద్వారాలు, 10,000 కమ్యూనిటీ వసతి గృహాలను నిర్మించనున్నట్లు తెలిపారు.


అయోధ్యలో ఆలయ నిర్మాణానికి ట్రస్ట్ ఏర్పాటుచేయాలని తన తీర్పు సందర్భంగా సుప్రీం కోర్టు సూచించింది. అయితే, ఇప్పటికే రామజన్మభూమి న్యాస్ ఉన్నందున మరో ట్రస్ట్ అవసరం ఉందా? అని ఆ సంస్థ అధ్యక్షుడు మహంత్ గోపాల్‌ దాస్ అన్నారు. దీనికే కొన్ని మార్పులు చేసి కొత్త సభ్యులను నియమించుకుంటామని తెలిపారు. అయితే, సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిన దరిమిలా కొత్త ట్రస్ట్ ఏర్పాటు బాధ్యత కేంద్రానిదేనని దిగంబర్ అఖాడా చీఫ్ అభిప్రాయపడ్డారు. తమ సభ్యులను కూడా ట్రస్ట్‌లో చేర్చాలని 'నిర్మోహి అఖాడా' అధినేత  మహంత్ దినేంద్ర దాస్ డిమాండ్ చేశారు. 
Related image
ట్రస్ట్ ఏర్పాటు, సభ్యుల నియామకం లాంటివి ప్రధానిస్థాయిలో తీసుకోవాల్సిన నిర్ణయాలని కేంద్రమంత్రి ప్రహ్లాద్ పటేల్ తేల్చి చెప్పారు. మరోవైపు, ట్రస్ట్ ఏర్పాటు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైనట్టు కేంద్ర హోంశాఖ వర్గాలు తెలిపారు. దీనికి సంబంధించిన బిల్లును ఈ శీతాకాల సమావేశాల్లో పార్లమెంటు ముందుకు తీసుకురానున్నట్టు తెలుస్తోంది.


అయోధ్యలోని రామమందిరానికి 2100 కిలోల బరువున్న గంటను బహుమతిగా ఇవ్వనున్నట్టు ఎటావా జిల్లాకు చెందిన హస్తకళాకారుడు ఇక్బాల్ అనే ముస్లిం సోదరుడు ప్రకటించారు. ఆరు అడుగుల ఎత్తు, ఐదు అడుగుల వెడల్పు 2100 కిలోల బరువున్న ఈ గంటను అయోధ్యలో రామమందిరం కోసం రూపొందించినట్టు తెలిపారు. జలేసర్‌ కు చెందిన ఇక్బాల్, సుమారు ₹ 10 నుంచి ₹ 12 లక్షలు ఖర్చుతో దీనిని తయారుచేస్తున్నారు తయారీ చివరి దశలో ఉంది.

Image result for <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=AYODHYA' target='_blank' title='ayodhya-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ayodhya</a> is getting the shapes of a spiritual city

Image result for lord rama in ayodhya

మరింత సమాచారం తెలుసుకోండి: