ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమలకు వేలాదిమంది భక్తులు తరలి వస్తున్నారు. స్వామివారి దర్శనం కోసం భారీ సంఖ్యలో భక్తులు వస్తున్నారు. కలియుగ దైవమైన శ్రీవేంకటేశ్వరుని దర్శనం కోసం దాదాపు 24 గంటల పాటు ఎదురుచూసి చూసి దర్శనం చేసుకుంటున్నారు తిరుమల భక్తులు. 

                                        

ఇంకా ఈరోజు అయితే తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు 24 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు తెలిపారు. టైంస్లాట్, ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతుందన్నారు. సాయంత్రం 6 గంటల వరకు శ్రీవారిని 49,251 మంది భక్తులు దర్శించుకున్నారు.

                                

అయితే ఈరోజు వారాంతం కావడం వల్లే భక్తులు భారీగా పెరిగారు అని టీటీడీ అధికారులు చెప్తున్నారు. కాగా ఈరోజు తిరుమలలో బూందీ పోటులో అగ్నిప్రమాదం జరిగింది. అయితే స్వామి వారి దయవల్ల ఎలాంటి ప్రాణ నష్టము జరగలేదు. కాకపోతే భక్తుల మాత్రం ఒకానొక సమయంలో భయపడిపోయారు. 

                                  

అయితే ఈ ప్రమాదం ఎందుకు జరిగింది అనేది ఇంతవరుకు తెలియలేదు. కాగా ఈ అగ్ని ప్రమాదం గతంలో కూడా జరిగింది. అయితే ఈ అగ్ని ప్రమాదం వల్ల తిరుమలలో లడ్డు ప్రసాదం అమ్మకాలు తాత్కాలికంగా నిలిపివేశారు. దీంతో తిరుమల లడ్డుని ఎంతో ఇష్టంతో తినే వారు బాధతో వెనుతిరగాల్సి వచ్చింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: