క్రిస్మస్ అంటే.. క్రిస్మస్ చెట్టును లైటింగు మెరుపులతో అలంకరించడమే కాదు. శాంతా క్లాజ్‌లా వేషాలు ధరించడం, ఇంకా చాలానే ఉంటాయి. ప్రపంచంలో అన్ని ప్రాంతాల్లో ఒకే తరహాలో క్రిస్మస్ వేడుకలు జరగవు. ఒక్కో దేశంలో... ఒక్కో రకంగా జరుగుతాయి. అందరూ కొలిచేది ఏసు క్రిస్తునే, కానీ.. సాంప్రదాయాల విషయానికి వచ్చేసరికి ఎవరి దారి వారిదే. ఒక్కొక్కరిది ఒక్కో నమ్మకం. కొన్ని దేశాల్లో క్రిస్మస్ రోజున చీపుర్లు మాయం చేస్తారు. శాంతాక్లాజ్‌ కు బదులు.. గొర్రె తల కలిగిన మనిషి వేషాలతో పిల్లలను భయపెడతారు. గిఫ్టులను షూలలో వదిలి వెళ్తారు. గుర్రాల అస్థిపంజరాలను ఊరేగిస్తారు. ఇలా అబ్బురపరిచే సాంప్రదాయాలు మరెన్నో ఉన్నాయి. 


క్రిస్మస్ కి కొద్ది రోజుల ముందు సగం గొర్రెలా ఉండే రాక్షసుడు భయపెడతాడు. ‘క్రాంపస్’ అనే ఈ వేషాన్ని చూసి పిల్లలు భయపడతారు. సాధారణంగా క్రిస్మస్ అంటే శాంతాక్లాజ్‌ గురించి పిల్లలకు చెబుతారు. కానీ, అక్కడి పిల్లలకు మాత్రం క్రాంపస్ వస్తాడు. చెడ్డ పిల్లలను తనతో తీసుకెళ్లిపోతాడని భయపెడతారు. డిసెంబరు 6న మంచి ప్రవర్తన కలిగిన పిల్లల షూలలో సెయింట్ నికోలస్ పంపే బహుమతులు ఉంటాయని, అల్లరి చేసే పిల్లల షూలలో క్రాంపస్ పంపే ఇనుప కడ్డీ ఉంటుందని చెబుతారు. దీంతో పిల్లలు మంచిగా ప్రవర్తించేందుకు ప్రయత్నిస్తుంటారు. అల్లరిచేస్తే క్రాంపస్ ఎత్తుకెళ్లిపోతాడని భయపడుతుంటారు.


ఉక్రేయిన్‌లో క్రిస్మస్ ట్రీ అలకరణ భిన్నంగా ఉంటుంది. మెరుపులు, లైట్లతోపాటు చెట్టుకు బూజు పట్టినట్లుగా సాలీడు గూళ్లను ఏర్పాటు చేస్తారు. దీని వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. ఓ వితంతు మహిళ పిల్లలు క్రిస్మస్ కోసం పైన్ మొక్కను పెంచుతారు. ఏటా దాన్ని అలంకరిస్తూ ఉంటారు. ఆ చెట్టు బాగా పెద్దది కావడం వల్ల అలంకరించేందుకు డబ్బులు సరిపోవు. దీంతో పిల్లలు క్రిస్మస్ ముందు రోజు ఆ చెట్టు దగ్గర కుర్చొని ఏడుస్తారు. వారి బాధను తెలుసుకున్న సాలీడు పురుగులు.. చెట్టు మొత్తాన్ని గూడు కట్టేందుకు వాడే దారాలతో అలకరిస్తాయి. దీంతో అక్కడి ప్రజలు క్రిస్మస్ రోజున తప్పకుండా సాలీడుకు ప్రాధాన్యం ఇస్తారు.


ఇటలీలో జనవరి 6న క్రిస్మస్ వేడుకను జరుపుకుంటారు. క్రిస్మస్‌(డిసెంబరు 25న)కు 12 రోజుల తర్వాత వేడుక జరుపుకోవడం అక్కడ ఆనవాయితీ. అదే రోజు రాత్రి (జనవరి 5) లా బెఫనా అనే మంత్రగత్తె ఇంటింటికి వచ్చి పిల్లలకు స్వీట్లు, కానుకలు ఇస్తుందని నమ్ముతారు. అప్పుడే పుట్టిన ఏసుక్రీస్తును వెతకడంలో భాగంగా ఆ మంత్రగత్తె ఇంటికి వెళ్తుందని చెబుతారు. గనాలోనూ క్రిస్మస్‌ను డిసెంబరు 25కు బుదులు జనవరి 7న జరుపుకుంటారు. టిమ్కాట్‌లో జనవరి 19న జరుపుకుంటారు.


ఇదేం సాంప్రదాయం..? క్రీస్తు పుట్టిన సమయానికి టీవీలే లేవు కదా అని ఆశ్చర్యం కలగవచ్చు. ఇది కూడా ఒక సాంప్రదాయమే. నార్స్ సంప్రదాయం ప్రకారం.. ఇంట్లో చెక్క దుంగలను కాల్చినట్లయితే నెగటివ్ ఎనర్జీ బయటకు పోతుందని, కొత్త ఏడాదిలో అంతా మంచే జరుగుతుందని భావించేవారు. ఈ సాంప్రదాయం కొన్నాళ్లు బాగానే సాగింది. అయితే, నేటి యుగంలో చాలామంది దుంగలను కాల్చకుండా.. టీవీల్లో వాటి వీడియోలను చూస్తు సాంప్రదాయాన్ని ఫాలో అవుతున్నారు. ఇది కొంచెం చిత్రంగానే ఉంది కదూ..

మరింత సమాచారం తెలుసుకోండి: