ఓం నమో వేంకటేశాయ!!

 

వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు

• ఈ రోజు సోమవారం,06.01.2020 ఉదయం 6 గంటల సమయానికి, తిరుమల: 18C°-23℃°.

 

• నిన్న 59,324 మంది భక్తులకు కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి వారి దర్శన భాగ్యం కల్గినది.

 

• వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో 31 గదుల్లో భక్తులు సర్వదర్శనం కోసం వేచి ఉన్నారు.

 

 • ఈ సమయం శ్రీవారి సర్వదర్శనాని కి సుమారు 24 గంటలు పట్టవచ్చును.

 

• నిన్న స్వామివారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు ₹: 2.85 కోట్లు.

 

• నిన్న 15,600 మంది భక్తులకు శ్రీ పద్మావతి అమ్మవారి దర్శన భాగ్యం కలిగినది.

 

•  శీఘ్రసర్వదర్శనం(SSD), ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్ ₹:300/-), దివ్యదర్శనం (కాలినడక) వారికి శ్రీవారి దర్శనానికి పట్టవచ్చును.

 

• ₹:10,000/- విరాళం ఇచ్చు శ్రీవారి భక్తునికి శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఒక విఐపి బ్రేక్ దర్శన భాగ్యం కల్పించిన టిటిడి.

 

గమనిక:

 

నేడు వైకుంఠ ఏకాదశి,రేపు ద్వాదశి 

• ఈ రొజు ఉదయం: 9 కి స్వర్ణరథం, రేపు ఉదయం 4.30 నుండి 5.30 గంటల వరకు చక్రస్నానం.

 

ప్రత్యేక దర్శనాలు నిలుపుదల:

జనవరి 7 వతేదీ వరకు దాతలకు ఇచ్చే సౌకర్యాలు రద్దు.

 

జనవరి 7 వ తేదీ వరకు వృద్ధులు, దివ్యాంగులకు, చంటిపిల్లలతల్లిదండ్రుల, ప్రత్యేక దర్శనాలు రద్దు.

 

జనవరి 8 వరకు దివ్యదర్శనం టోకెన్లు, టైంస్లాట్‌ సర్వదర్శనం టోకెన్లు రద్దు.

 

జనవరి 8 వరకు తేదీ వరకు అంగప్రదక్షిణ టోకెన్లు రద్దు.

 

ఏకాదశి దర్శనాం:

• ఈ రొజు ఉదయం ధ‌నుర్మాస కైంక‌ర్యాల అనంత‌రం 2 గంటల నుండి వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభం.

 

• ఉదయం 3.45 లకే  శ్రీవారి సర్వదర్శనానికి సామాన్యులకు దర్శన భాగ్యం.

 

జనవరి 21, 28వ తేదీల్లో వృద్ధులు, దివ్యాంగులకు శ్రీవారి ప్రత్యేక దర్శనం.

 

జనవరి 22, 29వ తేదీల్లో 5 ఏళ్లలోపు చంటిపిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనం.

 

తిరుప్పావై

 

ధనుర్మాసం కాలంలో తిరుమల శ్రీవారి ఆలయంలో సుప్రభాతానికి బదులుగా తిరుప్పావై పఠనం చేస్తారు. సహస్రనామార్చనలో తులసికి బదులు బిల్వపత్రాలతో పూజిస్తారు. ధనుర్మాసం ఉభయ సంధ్యల్లో ఇంటిని శుభ్రం చేసి దీపారాధన చేయడం వల్ల మహాలక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది. దరిద్రం తొలగి అష్టఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. విష్ణు ఆలయాల్లో ఉదయం అర్చన తర్వాత ప్రసాదాన్ని నివేదించి వాటిని పిల్లలకు పంచుతారు. దీన్నే బాలభోగం అంటారు. సూర్యుడు ధనస్సు నుంచి మకర రాశిలోకి ప్రవేశించే వరకు అంటే భోగి రోజు వరకూ ధనుర్మాసం కొనసాగుతుంది. ఈ నెల రోజులు విష్ణు ఆలయాల్లో పండుగ వాతావణం నెలకొంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: