జల్లికట్టు ఒక ఆటవిక క్రీడా. సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు కొన్ని రోజుల ముందు నుంచి జల్లికట్టు క్రీడ ప్రారంభమవుతుంది. సంక్రాంతి పండుగకు ముందు తమిళనాడులో ఎక్కువగా జల్లి కట్టు  జరుపుకుంటూ ఉంటారు. అయితే జల్లికట్టు క్రీడా సాంప్రదాయబద్ధమైనది  తమిళనాట ప్రజలు చెబుతుంటే... సుప్రీం కోర్టు మాత్రం మూగజీవాలను హింసిస్తున్నారు అంటూ జల్లికట్టు క్రీడలో నిషేధం విధించింది. సుప్రీంకోర్టు  నిషేధం విధించడంతో తమిళనాట ప్రజలందరూ ఒక్క తాటి పైకి చేరి నిషేధాన్ని తొలగింపు చేశారు. కోర్టు జల్లికట్టుని  నిషేధించినప్పటికీ తమిళనాడు జల్లికట్టు అలాగే  కొనసాగించారు. 

 

 

 జల్లికట్టు ఆటలో  చుట్టూ  గ్రామంలోని జనాలందరూ చేరగా... జనాల మధ్య గిత్తలు పరుగులు తీస్తుంటాయి. కాగా  పరుగులు తీస్తున్న గిత్తలను మచ్చిక చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు యువకులు  కానీ ఎద్దులు  మాత్రం అడ్డొచ్చిన వారిని కుమ్మేసుకుంటూ పరుగులు పెడుతూ ఉంటాయి. అయితే తమిళనాడులోనే కాదు తమిళనాడు బార్డర్ లోని పలు రాష్ట్రాలలో కూడా జల్లికట్టు సాంప్రదాయం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే చిత్తూరు జిల్లాలో కూడా జల్లికట్టు సాంప్రదాయం  కొనసాగుతూ ఉంటుంది. సంక్రాంతి వచ్చిందంటే చాలు చిత్తూరు ప్రజలు కూడా జల్లికట్టు లో  పాల్గొంటారు. అయితే ఈ జల్లికట్టులో ప్రాణాలు కోల్పోయిన వారు కూడా చాలామంది ఉన్నారు. పరుగులు తీస్తున్న ఎద్దులను లొంగదీసుకునేందుకు ఎద్దులకు అడ్డు వెళ్లేసరికి మంచి పరుగూ  మీద ఉన్న గిత్తలు అడ్డొచ్చిన వాళ్ళని కుమ్మేస్తూ ఉంటాయి . 

 

 

 అయితే తమిళనాడులో జల్లికట్టు ఎంత ఫెమస్సో  తెలుగు రాష్ట్రాల్లో  చిత్తూరు జిల్లాలో జరిగే జల్లికట్టు కూడా అంతే ఫేమస్. చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజక వర్గంలో జల్లికట్టు  కూడా జరుగుతుంది. అయితే ఈ జల్లికట్టు లో  పరిగెత్తుతున్న గిత్త లను పట్టుకొని లొంగదీసుకున్న వారికి భారీ బహుమతులు కూడా ఇస్తూ ఉంటారు. అయితే చిత్తూరు జిల్లాలో జరిగే పోటీలకు తమిళనాడు నుంచి కూడా పోటీ దారులు పాల్గొనేందుకు వస్తూ ఉంటారు. జల్లికట్టును  తిలకించేందుకు ఎంతో మంది ప్రజలు వస్తారు. కాగా తమిళ నాటే  కాదు తెలుగునాట కూడా గిత్తలు  కుమ్మేస్తూ ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: