తెలుగు రాష్ట్రాల ప్రజలు అందరూ అంగరంగ వైభవంగా జరుపుకునే పండుగ సంక్రాంతి. మూడురోజులపాటు జరిగే సంక్రాంతి పండుగను తెలుగు రాష్ట్రాల ప్రజలు అందరూ అంబరాన్ని అంటేలా జరుపుకుంటారు. ఇక సంవత్సరం ప్రారంభంలో మొదట వచ్చే పండుగ కావడంతో ఈ పండుగ ఎంతో విశిష్టతను సంతరించుకుంటుంది. సంక్రాంతి పండుగ అంటే సాంప్రదాయానికి నిలువుటద్దంల మారిపోతుంది. సాంప్రదాయమైన వస్త్రాలు సాంప్రదాయమైన అలవాట్లు ఇలా పూర్తిగా సాంప్రదాయ మయం అయిపోతుంది. ఇక వ్యాపారాలు ఉద్యోగాలు కోసం ఎక్కడెక్కడికో వెళ్లిన వారు అందరూ సంక్రాంతి పండుగ వచ్చిందంటే సందడి చేస్తారు. బంధువులు కుటుంబ సభ్యుల మధ్య సంక్రాంతి పండుగను అంగరంగ వైభవంగా జరుపుకోవడానికి ఎక్కువ ఇష్టపడతారు అందరు. 

 

 ఇక సంక్రాంతి పండుగ వచ్చిందంటే గొబ్బెమ్మలు రంగురంగుల రంగవల్లులు హరిదాసు కీర్తనలు గంగిరెద్దుల ఆటలు లేకపోతే సంక్రాంతి పండుగ బోసి పోయినట్లే... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగే కోడిపందాలు లేకపోయినా సంక్రాంతి సంక్రాంతి లాగే ఉండదు అని ప్రజలు భావిస్తారు. సంక్రాంతి పండుగ వచ్చిందంటే కోడిపందాలు జరుగుతూనే ఉంటాయి. కోడి పందాలు నిర్వహించవద్దు అంటూ చట్టం ఎన్ని ఆంక్షలు పెట్టినప్పటికీ కోడి పందాలు నిర్వహించడం లో మాత్రం ఎవరు వెనక్కి తగ్గరు. కోడి పందాలు నిర్వహించేందుకు కొన్ని నెలల ముందు నుంచే పందెం కోడి పుంజులను సిద్ధం చేస్తూ ఉంటారు. ఇక ఈ కోడి పందాల కోసం కొంతమంది ప్రత్యేకంగా కోళ్లను సిద్ధం చేసి ఎక్కువ ధరలకు అమ్ముతూ వ్యాపారాలు కూడా చేసుకుంటూ ఉంటారు. ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం కోడిపందాలు హోరెత్తిపోతు ఉంటాయి. 

 

 

 అయితే కోడి పందాలు నిర్వహించేందుకు కేవలం ప్రజలే కాదు ఎంతో మంది సినీ రాజకీయ ప్రముఖులు కూడా ఆసక్తి చూపుతుంటారు. మన రాష్ట్రం నుంచే కాకుండా పక్క రాష్ట్రం నుంచి కూడా కోడిపందాలు చూడడానికి తరలి వస్తుంటారు. ఇక కోడి పందాల బరిలో కోళ్ల సత్తాపై పందాలు కట్టేందుకు మన రాష్ట్ర ప్రముఖులే కాకుండా పక్క రాష్ట్రాలకు చెందిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా అప్పుడే వచ్చేస్తున్నారు. దీంతో హడావిడి భలే మజా అందుకుంది అంటున్నారు. ఇక ఈ కోడిపందాలపై లక్షల్లోనే పందాలు కాస్తుంటారు. దీంతో ఈ కోడిపందాలు మరింత రసవత్తరంగా సాగిపోతూ ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: