సంక్రాంతి పండుగ సంబరాలు గురించి ఎంత చెప్పుకున్నా తనివి తీరదు. భోగిమంటలు, గొబ్బెమ్మలు, అమ్మలక్కల ముగ్గుల, గంగిరెద్దు హడావిడి, హరిదాసుల పాటలు.. ఇలా అసలుసిసలు పండుగ సంబరాలను పంచుతుంది సంక్రాంతి. అయితే ఈ పండుగకు మరో అదనపు ఆకర్షణ కూడా ఉంటుంది. అవే.. కోడిపందాలు. వీటిపై ప్రతి ఏడాదీ పండుగ నెల ముందే కోర్టు కేసులు మొదలైపోతాయి. కానీ.. రాజకీయ నాయకుల బీరాలు, సినిమా సెలబ్రిటీల హడావిడితో కోడి పందాలు మాత్రం యధావిధిగా జరిగిపోతూంటాయి. అసలు కోడి పందాలు లేకుండా సంక్రాంతి పండుగ ను ఊహించుకోవడమే కష్టం.

 

 

ఏమాట‌కు ఆమాటే చెప్పుకోవాలి. కోడిపందాల మజానే వేరు. ప్రజల సంబరాలను చట్టం అడ్డుకోవాలని ప్రతి ఏడూ ప్రయత్నిస్తుంది. వారి ఆనందాలను చ‌ట్టం తుడిచి వేస్తుందా? అనే సందేహం కూడా వస్తుంది.  కోడి పందేల‌పై చ‌ర్యలు తీసుకోవాలంటూ.. కోర్టుల్లో పిటిషన్లు వేస్తారు. ఈసారి కూడా కోడిపందాలను అడ్డుకోవాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిష‌న్‌పై విచార‌ణను ఈ నెల 17కు వాయిదా వేసింది కోర్టు. అంటే.. ఓ నాలుగు రోజులు చ‌ట్టం సైలెంట్ అయిపోయింది అన్నమాట‌! ఈ నాలుగు రోజులు చాలు కదా కోడిపందాల మజా ఎంజాయ్ చేయటానికి.. సంబరాలను అంబరాలకు తాకటానికి. దీంతో ప్రజలంతా.. బాగుంది క‌దా.. ఇక‌, పందేలు వేసేసుకుందామా.. సై.. సై అంటూ పల్లెటూళ్లలో సందడి మొదలుపెట్టేశారు.

 

 

ఏమాట‌కు ఆమాటే చెప్పుకోవాలి.. ఎన్ని అడ్డంకులు ఎదురైనా కోడిపందాలకు వెళ్లని వారు పల్లెటూళ్లలో ఉండనే ఉండరు. సగం ఈ పందాల కోసమే పండుగకు సిద్ధమవుతారు కొందరు. అందుకే ఈ పండుగ పెద్ద పండుగ అయింది. రైతుల ఇంట ఆనందం, ప్రజల ఇంట సంతోషాలు, పిల్లా పాపల ఆటపాటలతో ఇళ్లన్నీ ఆనందాలతో వెల్లవిరుస్తూ ఉంటాయి. మరింకెందుకు ఆలస్యం.. పండుగ సంబరం షురూ చేసేయండి మరి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: