మూడు రోజులు ఎంతో ఆనందంగా జరుపుకునే పండుగా సంక్రాంతి. ఈ సంక్రాంతి పండుగలో మొదటి రోజు భోగి రెండొవ రోజు సంక్రాంతి మూడోవ రోజు కనుమ ఇలా మూడు రోజులు పాటు పండుగను ఎంతో సంతోషంగా జరుపుకుంటాం. అలాంటి ఈ పండుగను అప్పట్లో ఎంతో న్యాచురల్ జరుపుకునే వాళ్ళము.. ఎంతో సహజంగా ఈ పండుగను జరుపుకునే వాళ్ళు. 

 

కానీ ఇప్పుడు అన్ని ఆర్టిఫీషియలే.. అప్పట్లో భోగిప‌ళ్లు, హ‌రిదాసుల కీర్త‌న‌లు, గంగిరెద్దుల మేళాలు.. కోడి పందేలు.. వంటివి ఉండేవి.. ఇప్పుడు అన్ని స్కూళ్ల‌లో ప్ర‌త్యేకంగా ఒక చోట చేసి చూపించి విద్యార్థుల్లో ఒకింత అవగాహ‌న క‌ల్పిస్తున్నారు. ఒకప్పుడు సహజంగా చూసి పండుగ గురించి తెలుసుకునే పిల్లలు ఇప్పుడు అన్ని ఆర్టిఫీషియల్ గా చూడాల్సి వస్తుంది. 

 

ఇలా చేసి చూపిస్తున్నందుకు ఆనంద పడాలో.. బాధ పడాలో తెలియటం లేదు. ఇలా చెయ్యటం వల్ల రాను రాను పండ‌గ ముచ్చ‌ట త‌గ్గిపోతోంద‌ని ఆందోళ‌న‌ వ్య‌క్తం చేయాలో.. క‌నీసం ఇలా అయినా బ‌తికిస్తున్నార‌ని ఆనంద ప‌డాలో తెలియ‌డం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఏది ఏమైనా ఇలా ఆర్టిఫీషియల్ చూస్తే ఎంత విచిత్రం.. ఒకప్పుడు మనం అంత దగ్గర నుండి చూసేవాళ్ళం.. కానీ ఇప్పుడు అన్ని ఆర్టిఫిషయాలే.. సంప్రదాయాలు అప్పట్లో ఆలా ఉండేవి.. ఇలా ఉండేవి అని చెప్పుకునే రోజులు వచ్చేశాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: