సంక్రాంతి.. పండుగ సంబరాలకు హద్దూ పొద్దూ ఉండదు. అంబరాన్నంటే సంబరాల సంక్రాంతి.. పల్లెటూళ్లు కళకళలాడే పండుగ. పిండివంటలు, కొత్త సినిమాలు, కోడి పందేలు, జూదాలు.. ఈ సందళ్లే వేరు. అయితే సంక్రాంతి అంటే ఇవేనా.. వీటి కోసమేనా ఏడాది ఎదురు చూసేది.

 

కానీ.. అసలు సంక్రాంతి వేళ చేయాల్సిన పనులు మాత్రం ఇవికాదండోయ్.. సంక్రాంతి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమయ్యే రోజు. అందుకే ఈ రోజు చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. అందులోనూ ఉదయాన్నే కొన్ని ముఖ్యమైన పనులు చేయాలి. సూర్యోద‌యానికి పూర్వమే నిద్ర లేచే అల‌వాటు ఉన్నవారు స‌రే.

 

ఉదయాన్నే లేచే అలవాటు లేని వారు కూడా సంక్రాంతి ఒక్కరోజు నాడు మాత్రం ఖ‌చ్చితంగా ప్రాతః కాలమే నిద్ర లేవాలి. ఎందుకంటే.. ఉత్తరాయ‌ణ పుణ్య కాలం ప్రారంభ‌మ‌య్యే రోజుకు ప్రాశ‌స్త్యం ఉంది.

 

స్నానానంత‌రం కుటుంబంతో స‌హా ముందు ఇంట్లోని దేవుడిని అర్చించుకోవాలి. దీపారాధ‌న చేసుకోవాలి. కొత్త బ‌ట్టలు క‌ట్టుకుని స‌మీపంలో విష్ణు ఆల‌యానికి వెళ్లి స్వామి ద‌ర్శనం చేసుకోవాలి. ఇదీ శాస్త్రాలు చెప్పే సంగతులు. ఆ తర్వాత మిగిలిన సంక్రాంతి సంబరాలు చేసుకుందాం. ఏమంటారు..?

మరింత సమాచారం తెలుసుకోండి: