తెలుగు వారు పెద్ద పండుగ అని ముద్దుగా పిలుచుకునే పండుగ సంక్రాంతి. సంక్రాంతి దేశవ్యాప్తంగా వివిధ పేర్లతో జరుపుకునే  పండుగ. సంక్రాంతి అని తెలుగునాట అన్నా పొంగల్ అని తమిళ తంబి పలికినా  మధ్యప్రదేశ్, రాజస్థాన్ లో సంక్రాత్ అని పిలిచినా జనవరిలో ఒకే విధంగా జరుపుకునే పండుగ సంక్రాంతి. సంక్రాంతి పండగ మూడు రోజుల పాటు జరుపుకుంటాం. భోగి, సంక్రాంతి, క‌నుమ అని మూడు రోజులు ఎంతో ఆనందంగా జ‌రుపుకుంటారు. పాడి పంటలు వచ్చిన సంతోషంలో రైతులు కూడా ఆనందోత్సాహాలతో ఉంటారు. 

 

ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి వచ్చిందంటేనే గొబ్బి పాటలు, గంగిరెద్దులు, హ‌రిదాసులు, రథం ముగ్గులు, భోగిమంటలు, బొమ్మల కొలువులు, పిండి వంటలు, కొత్త దుస్తులు.. వాటిని ధరించి చూడముచ్చటగా అలంకృతమైన ఆడపడుచులు కనివిందు చేస్తారు. అయితే సంక్రాంతి అనే మాటను శాస్త్రాలు చాలా గంభీరంగా పేర్కొన్నాయి. సూర్యుడు మ‌క‌ర రాశిలో ప్ర‌వేశించే కా లం క‌నుక దీనిని మ‌క‌ర సంక్రాంతి అంటారు. ఇక‌, ఇప్ప‌టి నుంచి ఉత్త‌రాయ‌ణ పుణ్య‌కాలం ప్రారంభ మ‌వు తుంది. ఇది పితృదేవ‌తారాధ‌న‌కు అత్యంత విశేష‌మైన కాలంగా పేర్కొన్నారు. 

 

మ‌న సంప‌ద‌కు, మ‌న ఆదాయానికి కూడా మ‌న పితృదేవ‌త‌లే కార‌ణ‌మ‌ని న‌మ్ముతాం. మ‌న‌కు జ‌న్మ‌నిచ్చిన వారు, వారికి జ‌న్మ‌నిచ్చిన‌వారిని ప్రార్ధించుకునే కాలం సంక్రాంతి. ఈ మూడు రోజులలో మొదటి రోజు బోగిమంటలతో, రెండవ రోజు పొంగలి, పిండివంటలతో, పితృ దేవతల, దేవుళ్ళ పూజలతో, మూడవ రోజు గో పూజలతో అలాగే మాంసప్రియులకు మంచి కూరలతో, మూడురోజుల పండుగ ఎంతో ఆనందంగా కొనసాగుతుంది. మ‌రియు ఇంటిల్లపాది మిగతా రోజులు ఎక్కడున్నా సరే ఈ పండుగ సమయానికి ఇళ్ళల్లో వాలిపోయి ఆనందంగా జ‌రుపుకుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: