పురాత‌న‌కాల‌మైన ఆల‌యాలు, క‌ట్ట‌డాలు అధికంగా ఉన్న దేశం మ‌న‌ది. అలాగే మ‌త‌ప‌ర‌మైన నిర్మాణాలు మ‌న‌ద‌గ్గ‌రే ఎక్కువ‌. ఇక ఇలాంటివ‌న్నీ చూడ‌డానికి మ‌న‌ద‌గ్గ‌ర‌కు దేశ విదేశాల‌నుండి టూరిస్టులు వ‌స్తుంటారు. చాలా వరకు పురాతన ఆలయాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఎంతో నేపథ్యం ఉన్న కట్టడాలు కూడా నిర్లక్ష్యం వల్ల భూస్థాపితమయ్యాయి. ఇక‌ కొన్ని మాత్రం ఇప్పటికీ సజీవంగా చెక్కుచెదరకుండా ఉన్నాయి. అలాంటి వాటిలో ఈ ఆలయం కూడా ఒకటి. మరి ఆ ఆలయం ఎక్కడ ఉంది, ఆలయ చరిత్ర ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం...

 

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందూ దేవాలయాల‌యాల‌న్నిలో అతి పురాతనమైన దేవాల‌యం బీహార్‌లో ఉంది. కైమూర్ జిల్లాలోని కౌరా ప్రాంతంలోని ముండేశ్వరీ ఆలయం ప్రపంచంలోనే అతి పురాతనమైందని చరిత్రకారుల అంచనా. మూడు, నాలుగు శతాబ్దాల కాలంలో దీన్ని నిర్మించారని చెప్తుంటారు. విష్ణు భగవానుడు ఇక్కడ కొలువై ఉన్నాడు. ఏడవ శతాబ్దంలో శివుని విగ్రహాన్ని కూడా పెట్టారు. ఈ ఆలయం సముద్రమట్టానికి 608 అడుగుల ఎత్తులో ఉన్నది. ఈ ఆలయం చుట్టు పక్కల ప్రాంతాల్లో 625 సంవత్సరం నాటి శాసనాలు బ‌య‌ట‌ప‌డినాయి. ఇది వారణాసికి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్నది.

 

క్రీ.శ. 105 లో నిర్మించిన భారతదేశంలోని మొట్టమొదటి దుర్గామాత శక్తి ఆలయం .ఇది కైమూర్ జిల్లాలోని బీహార్ రాష్ట్రంలో వుంది. ఈ ఆలయం ముండేశ్వరీ అనే పర్వతం మీద వుంటుంది. కొంత వరకూ వరాహి మాతగా కనిపిస్తుంది. ఇక్కడ అమ్మవారి వాహనం మహిషి. అమ్మవారి దేవాలయం అష్టభుజి దేవాలయం. దక్షిణ దిశలో అమ్మవారి ప్రధాన ఆలయ ద్వారం ఉండటం గమనార్హం. ఈ ఆలయంలో అమ్మవారు 10చేతులతో ఎద్దు పైన స్వారీ మహిషాసురమర్ధిని రూపంలో వుంటుంది. ఇక్కడ శివుడు కూడా 4ముఖాలతో వుంటాడు. ఇక్క‌డ దుర్గామాత ఆల‌యాన్ని ద‌ర్శించుకుంటే చాలా మంచిద‌ని ఎంతో మ‌హిమ గ‌ల శివుడు ఇంకా ఇత‌ర‌త్రా పూజ‌లు కూడా ఎక్కువ‌గా ఇక్క‌డ జ‌రుగుతుంటాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: