శ్రీవారి భక్తులకు రేపటి నుంచి ఉచిత లడ్డూప్రసాదాన్ని అందించేందుకు టీటీడీ సిద్ధమైంది. ఇప్పటివరకూ నడకదారి భక్తులకు మాత్రమే ఉచితలడ్డూ అందించిన టీటీడీ... ఇకపై స్వామివారిని దర్శించుకున్న ప్రతీఒక్కరికీ లడ్డూఅందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అదనపు లడ్డూలు కావలసిన భక్తులు ఎలాంటి సిఫార్సు లేఖలు లేకూండానే నేరుగా కౌంటర్లో కోనుగోలు చేసుకోవచ్చు. 

 

తిరుమల శ్రీ వెంకటేశ్వరుడికి  ఎంత ప్రశస్తి ఉందో.. ఆయన దివ్యప్రసాదం లడ్డూకి అంతే ప్రాముఖ్యత ఉంది. ఆ ప్రసాదం పొందడానికి పలురకాల విధానాలున్నాయి.కాలినకడకన దర్శనానికి వెళ్లే భక్తులకు ఒక లడ్డూ ఉచితంగా ఇస్తారు. 10 రూపాయల వంతున రెండు లడ్డూలు 25 రూపాయల వంతులన రెండు లడ్డూలు ఇస్తారు. సర్వదర్శనం భక్తులకు రెండు పదిరూపాయల లడ్డూలు, 25 రూపాయల లడ్డూలు రెండిస్తున్నారు.300 రూపాయల ప్రత్యేక దర్శనానికి వెళ్లే వారికి, 500 రూపాయల బ్రేక్‌ దర్శనానికి వెళ్లే వారికి.. ఒకొక్కరికి రెండు లడ్డూలు ఉచితంగా ఇస్తున్నారు. అదనపు లడ్డూలు కావాలంటే ఒక్కింటికీ 50 రూపాయల చొప్పున వెచ్చించాలి.  ఆర్జిత సేవల్లో పాల్గొనేవారికి ఉచితంగా లడ్డూ ప్రసాదాలు అందజేస్తున్నారు. టీటీడీ ఉద్యోగులు, రిటైర్డ్‌ ఉద్యోగులకు నెలకు 10 లడ్డూలు ఇస్తుంది .ఒక్కోలడ్డూ 5 రూపాయల చొప్పున అందిస్తోంది.ఒక్కో లడ్డూ ప్రసాదం తయారీకీ 40రూపాయలు చొప్పున ఖర్చు పెడుతోంది టీటీడీ. కాలినడక భక్తులకు మొత్తం ఐదు లడ్డూలపైన 130 రూపాయలు రాయితీ ఇస్తున్నారు. సర్వదర్శనం భక్తులకు మొత్తం నాలుగు లడ్డూలపైన 90 రూపాయల  రాయితీ లభిస్తోంది. ప్రత్యేక దర్శనం, బ్రేక్‌ దర్శనం వారికి ఒకొక్కరికి రెండు లడ్డూలపైన 80 రూపాయలు రాయితీ ఇస్తోంది టిటిడి . ఇక టిటిడి ఉద్యోగులు, రిటైర్డ్‌ ఉద్యోగులకు ఒకొక్కరికి నెలకు 350 రూపాయల రాయితీ లభిస్తోంది. 

 

లడ్డూ ప్రసాదాలపై  రాయితీల వల్ల ఏటా టీటీడీ పై 250 కోట్ల రూపాయల వరకు భారం పడుతోంది. భక్తులుకు పంపిణి చేసేందుకు టిటిడి ..రోజుకు మూడున్నర లక్షల లడ్డూలు తయారు చేస్తూంది. వీటి సంఖ్య ఐదు లక్షల లడ్డూలకు పెంచాలన్నది టీటీడీ లక్ష్యం. దీనికోసం ఆలయం వెలుపల వున్న బూంది పోటుకి , అనుబంధంగా మరో బూంది పోటుని నిర్మిస్తోంది టీటీడీ. లడ్డు తయ్యారీ సంఖ్య ఐదు లక్షలకు పెరిగితే. టీటీడీపై మరింత భారం పడనుంది.దీనికి గానూ శ్రీవారిని దర్శించుకునే ప్రతి ఒక్కరికీ ఒక లడ్డూ ఉచితంగా ఇచ్చి, మిగతా లడ్డూలను విక్రయించాలని టీటీడీ నిర్ణయించింది. దీంతో స్వామివారిని దర్శించుకున్న భక్తులకు ఉచితంగా ప్రసాదం అందించడం, అదనపు లడ్డూల కొనుగోలు కోసం ఏర్పాటు చేస్తోంది టీటీడీ. ప్రస్తుతం శ్రీవారిని రోజుకి 80 వేల మంది భక్తులు దర్శించుకుంటున్నారు.స్వామివారిని దర్శించుకున్న ప్రతి భక్తుడికి ఉచితంగా లడ్డు ప్రసాదం అందజేస్తే....టిటిడి పై రోజుకు 32 లక్షలు, ఏడాదికి116 కోట్ల రూపాయల వరకు భారం పడుతుంది. 

 

లడ్డూలపై రాయితీ ఎత్తేస్తారా, లడ్డూ ప్రసాదాన్ని లాభనష్టాలతో లెక్కిస్తారా, టీటీడీ ఏమైనా వ్యాపార సంస్థా?.. భక్తులకు శ్రీవారి లడ్డూల ప్రసాదాన్ని దూరం చేస్తారా అన్న విమర్శలు మొదలయ్యాయి. స్వామి వారికి హుండీ ద్వారా 1200 కోట్లు రూపాయల ఆదాయమొస్తుంటే.. ఉద్యోగులు జీతభత్యాలు, పెన్షన్లకు ఏటా 1300 కోట్లు వ్యయం అవుతుంది. అంటే టీటీడీకి ఆదాయం కన్నా వ్యయమే అధికంగా ఉన్నట్లు అర్థమవుతోంది. ఇక టిటిడి నిర్వహిస్తున్న పథకాలకు.. భక్తుల నుంచి విరాళాలు అందుతుండడంతో కార్యక్రమాలు సజావుగా సాగిపోతున్నాయి. ప్రస్తుత పరిస్థితులను బట్టి.... టీటీడీ ఆర్ధిక క్రమశిక్షణ పై దృష్టి  సారించాల్సి ఉందన్న విషయం అర్థమవుతోంది. భారత దేశంలోని ఏ హిందూ ఆలయానికి వెళ్లినా...ప్రసాదం ఇవ్వడం సంప్రదాయంగా వస్తోంది. వంద కోట్ల ఆదాయం వస్తున్న శ్రీకాళహస్తి, కాణిపాకం, శ్రీశైలం, విజయవాడ ఆలయాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: