* ఒకే రోజు ఏడు వాహనాలు


* భక్తుల రద్దీకి తగ్గట్టు ఏర్పాట్లు

 

తిరుమల, 30 జనవరి 2019 (కలియుగ నారద) : 
తిరుమల శ్రీవారి ఆలయంలో ఫిబ్రవరి 1న శ‌నివారం రథసప్తమి పర్వదినం నిర్వహ‌ణ‌కు స‌ర్వం సిద్ధమైంది. శ్రీ‌వారి ఆల‌యంతోపాటు అన్నప్రసాదం, నిఘా మ‌రియు భ‌ద్రత‌, ఇంజినీరింగ్, ఉద్యాన‌వ‌న త‌దిత‌ర విభాగాలు ఏర్పాట్లు పూర్తి చేశాయి.  

 

* భ‌క్తులు చ‌లికి, ఎండ‌కు, వ‌ర్షానికి ఇబ్బందులు ప‌డ‌కుండా గ్యాల‌రీల్లో వేచి ఉండేందుకు వీలుగా తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేశారు.

 

* భ‌క్తుల‌కు ఉద‌యం నుండి రాత్రి వ‌ర‌కు టి, కాఫి, పాలు, తాగునీరు, మ‌జ్జిగ‌, అల్పాహారం, అన్నప్రసాదాలు నిరంతరాయంగా పంపిణీ చేయనున్నారు.

 

* గ్యాల‌రీల‌లో ఉన్న భ‌క్తుల‌కు అన్నప్రసాద విత‌ర‌ణ‌కు ఫుడ్ కౌంట‌ర్లు ఏర్పాటు చేస్తున్నారు.

 

భ‌క్తులకు మ‌రింత మేరుగైన సేవ‌లందించేందుకు అద‌న‌పు సిబ్బందికి డెప్యుటేష‌న్ విధులు కేటాయిస్తున్నట్టు తెలియ‌జేశారు.

 

ప్రతి గ్యాల‌రీలో శ్రీ‌వారి సేవ‌కులు, ఆరోగ్య సిబ్బంది ఉంటారు.భ‌క్తులు వాహ‌న‌సేవ‌ల‌ను తిల‌కించేందుకు వీలుగా ఎల్ఇడి స్క్రీన్లు ఏర్పాటు చేశారు.

 

వాహనసేవల సమయాలు

శ్రీ‌వారి ఆల‌యంలో తెల్లవారుజామున కైంక‌ర్యాలు పూర్తయిన త‌రువాత ఉద‌యం 4.30 గంట‌ల‌కు శ్రీమలయప్ప స్వామివారు ఆలయం నుండి వాహనమండపానికి వేంచేపు చేస్తారు. అక్కడ విశేష స‌మ‌ర్పణ చేప‌డ‌తారు.

 

ఉదయం 5.30 నుండి 8 గంట‌ల వ‌ర‌కు - సూర్యప్రభ‌ వాహనం

ఉదయం 9 నుండి 10 గంట‌ల వ‌ర‌కు - చిన్నశేషవాహనం 

ఉదయం 11 నుండి 12 గంట‌ల వ‌ర‌కు - గ‌రుడ వాహనం

మ‌ధ్యాహ్నం 1 నుండి 2 గంట‌ల వ‌ర‌కు - హనుమంత వాహనం

మ‌ధ్యాహ్నం 2 నుండి 3 గంట‌ల వ‌ర‌కు - చక్రస్నానం

సాయంత్రం 4 నుండి 5 గంట‌ల వ‌ర‌కు - కల్పవృక్ష వాహనం

సాయంత్రం 6 నుండి రాత్రి 7 గంట‌ల వ‌ర‌కు - సర్వభూపాల వాహనం

రాత్రి 8 నుండి 9 గంట‌ల వ‌ర‌కు - చంద్రప్రభ వాహనం

మరింత సమాచారం తెలుసుకోండి: