సమ్మక్క సారక్క జాతర అనేది ములుగు జిల్లా, తాడ్వాయి మండలానికి చెందిన మేడారం గ్రామంలో జరిగే ఒక గిరిజన జాతర. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగ. భారత దేశంలో కుంభమేళా తరువాత అత్యధికులు హాజరయ్యే పండుగ ఇదే. వివిధ రాష్ట్రాల నుంచి పది కోట్ల మందికి పైగా హాజరు అవుతారని అంచనా.  ఇక తెలంగాణ కుంభమేళగా ప్రసిద్ధిగాంచిన మేడారం జాతరకు సర్వం సిద్ధమైంది. ఆసియాలోనే అతి పెద్ద గిరిజన పండుగ మేడారం.. సమ్మక్క, సారలమ్మ మహాజాతర తేదీలను ఇప్పటికే ఖరారు చేశారు గిరిజన పూజారులు. 

 

ఫిబ్రవరి 5, 6, 7, 8 తేదీల్లో ఈ మహా జాతర జరగనుంది. గిరిజన సంప్రదాయబద్ధంగా నిర్వహించే ఈ మహాజాతర ఖ్యాతి ఖండాంతరాలు దాటింది. మ‌రోవిష‌యం ఏంటంటే.. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజ‌న జాత‌ర‌గా మేడారం స‌మ్మ‌క్క‌-సార‌ల‌మ్మ జాత‌రగా రికార్డు చెందింది. జ‌య‌శంక‌ర్ భూపాల ప‌ల్లి జిల్లాలోని తాడ్వాయి మండలములో ఉన్న మారుమూల అటవీ ప్రాంతమైన మేడారంలో దట్టమైన అడవులు, కొండ కోనల మధ్య ఈ చారిత్రాత్మకమైన ఈ జాతర జరుగుతుంది. ఇక ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగగా ప్రసిద్ధిగాంచిన మేడారం జాతర గిరిజన సంప్రదాయాన్ని కళ్లకు కడుతుంది.  

 

సమస్త గిరిజనుల సమారాధ్య దేవతలు, కష్టాలు కడతేర్చే కలియుగ దైవాలుగా, ఆపదలో ఉన్నవారిని ఆదుకునే ఆపధ్భాందవులుగా మ‌న‌దేశంలోనే వనదేవతులుగా సమ్మక్క-సారక్క లు పూజలందుకుంటున్నారు. రెండేళ్లకోసారి జరిగే మహా జాతర మాఘ శుద్ధ పౌర్ణమి రోజున గిరిజన సంప్రదాయం ప్రకారం జరుపుకోవడం అనవాయితీగా వస్తోంది. మ‌రియు తెలుగు రాష్ట్రాలతో పాటు... దేశవ్యాప్తంగా ఉన్న గిరిజన తెగలు.. ఆసియా ఖండంలోని దేశాల నుంచి కూడా తరలి రావడం ఈ పండుగ ప్రత్యేకత.

మరింత సమాచారం తెలుసుకోండి: