ఈ ప్రపంచంలో ఆనందాన్నిచ్చేది ఏది.. ఈ ప్రశ్నకు చాలా మంది చెప్పే సమాధానం డబ్బు. అవును చాలా వరకూ డబ్బు ద్వారా అన్ని సుఖాలూ లభిస్తాయి. కానీ.. ఈ సుఖాలు వేరు.. ఆనందం వేరు.. మరి ఆనందం ఎక్కడ ఉంది...?

 

ఈ ఆనందాన్ని తెలుసుకోవడం ఎలా.. ఇదో చిక్కుప్రశ్న. కానీ చాలా మంది ఆధ్యాత్మిక వేత్తలు చెప్పే సులభమైన సమాధానం ఏంటంటే.. ఆ ఆనందం నీలోనే ఉందని.. మనం వుండే ఇల్లు మూడొందల గజాలైనా, మూడువేల గజాలైనా నీ ఒంటరితనం నీదే.

 

నీలోని మనిషికి సంతోషం..నీ బాహ్యప్రపంచ వస్తువులతో రాదు. నువ్వు మామూలు క్లాసులో ప్రయాణం చేసినా, ఫస్ట్ క్లాసులో ప్రయాణం చేసినా.. విమానం కూలినప్పుడు దాంతోపాటు నువ్వు కూడా పోతావు.

 

అందుకే, మాట్లాడటానికి నీకు స్నేహితులు, బంధువులు వుంటే.. అదే నిజమైన సంతోషం. నీకు ఏది సంతోషాన్నిస్తుందో నీకు తెలుసు. కాకపోతే నువ్వు అది తెలుసుకోవాలంటే పరుగు ఆపి.. నీ మనసు మాట వినాలి. అప్పుడు అది నీకు చెబుతుంది..నీకు ఎలా సంతోషం లభిస్తుందో. విని చూడండి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: