అయ్యప్ప.. హిందూ దేవతలలో ఒకరు. ఈయనను హరిహరసుతుడని, ధర్మశాస్త, మణికంఠుడని కూడా పిలుస్తారు. అయ్యప్ప పూజా సాంప్రదాయం అధికంగా దక్షిణ భారతదేశంలో ఉంది. దక్షిణ భారతదేశంలో ప్రముఖ పుణ్య క్షేత్రాల్లో శబరిమల ఒకటి. శబరిమలలో కొలువున్న అయ్యప్పస్వామిని దర్శించుకోవడానికి ఏటా లక్షలాది మంది భక్తులు దేశ, విదేశాల నుంచి తరలివస్తారు. ఏడాదిలో కొద్ది రోజులు మాత్రమే స్వామివారి దర్శనం లభిస్తుంది. ఇవ‌న్నీ ప‌క్క‌న పెడితే ఆయ్య‌ప్ప చిన్న‌త‌నం గురించి చాలా మంది కొన్ని విష‌యాలు తెలియ‌వు. విష్ణువు మరియు శివుడి అంశ అయ్య‌ప్ప అని మ‌నంద‌రికి తెలుసు.

 

ఒక కథనం ప్రకారం శివుడు మరియు మోహిని తమ బిడ్డను పంపానది తీరంలో వదిలివెళ్ళారట. పిల్లలు లేని పండాలం రాజు రాజశేఖరుడు ఆ పసికందు అయ్యప్పను గుర్తించి తనకు దక్కిన వరంగా, తన కొడుకుగా దత్తతు చేసుకున్నాడూ. మహారాజు రాజశేఖరుడు అయ్యప్పను దత్తత చేసుకున్నాక, తన సొంతబిడ్డ రాజరాజన్ పుట్టాడు. ఇద్దరు అబ్బాయిలు యువరాజుల్లాగానే పెరిగినా, అయ్యప్ప యుద్ధకళలలో, వివిధ శాస్త్రాలు, పురాణాలలో తన ప్రతిభ కనబర్చాడు. శిక్షణ,చదువు అయిపోయాక తన గురువుకి గురుదక్షిణ చెల్లించిన సమయంలో.. అయ్యప్ప అభూతశక్తులు తెలిసిన గురువు ఆయనని తన గుడ్డి మరియు మూగ కొడుకుకి చూపు, మాట తెప్పించమని కోరాడు. 

 

మణికంఠ తన చేతిని ఆ బాబు తలపై పెట్టగానే అద్భుతం నిజంగానే జరిగింది. ఇక సింహాసనానికి వారసుడిని ప్రకటించే సమయం వచ్చేసరికి, మహారాజు రాజశేఖర అయ్యప్పనే రాజుగా చూడాలనుకున్నాడు కానీ.. మహారాణి తన సొంత కొడుకే రాజు కావాలని ఆశించింది. అందుకని దివాను(మంత్రి) మరియు వైద్యుడితో కలిసి మణికంఠను చంపేసే పథకం వేసింది. ఈ క్ర‌మంలోనే అనారోగ్యం నాటకంలో భాగంగా, మహారాణి తన వైద్యుడు అసాధ్యమైన చిట్కా చెప్పేట్లా చేసింది. అదేంటంటే ఆడపులి పాలని తేవడం. ఎవరూ అది చేయలేనప్పుడు, ధైర్యవంతుడైన మణికంఠ తను వెళ్తానని, తండ్రి వద్దంటున్నా చెప్తాడు. అయితే వెళ్ళేదారిలో తన కర్తవ్యం ప్ర‌కారం  రాక్షసి మహిషిని ఎదుర్కొని, అఝుథ నది తీరంలో సంహరిస్తాడు. 

 

అలా ఆయన జీవితలక్ష్యం పూర్తయింది. కానీ వెళ్ళాల్సిన దూరం చాలా ఉంది..అందుకని, మణికంఠ అడవిలో పులిపాల కోసం ప్రవేశించాడు. ఇక అక్కడ‌ పులితో పోరాడి గెలిచి, దాని మీదనే ఊరేగుతూ భవంతికి తిరిగొచ్చాడు. మ‌రోవైపు మహారాజుకి తన కొడుకుపై మహారాణి చేసిన కుట్ర తెలిసిపోయి, మణికంఠను క్షమించమని అర్థిస్తాడు. మణికంఠ మహారాజుకి తన జీవితలక్ష్యం పూర్తయినందున, స్వర్గానికి తిరిగి వెళ్ళాల్సివుంటుందని తెలిపాడు. మహారాజును శబరి కొండపై తన చిన్న జీవితానికి గుర్తుగా ఒక ఆలయం నిర్మించమని కోరతాడు. దీంతో ఈ గుడి కట్టడం పూర్తయ్యాక, పరశురాముడు అయ్యప్ప విగ్రహాన్ని మకరసంక్రాంతి పర్వదినాన ప్రతిష్టించాడట. అలా అయ్యప్ప దేవునిగా పూజించబడుతున్నాడు.


 
 
 
 
 
 
 
  

మరింత సమాచారం తెలుసుకోండి: