రావణుడి తండ్రి మానవుడు, బ్రాహ్మణుడైన విశ్రవసు బ్రహ్మ. రావణుడి తల్లి రాక్షస స్త్రీ అయిన కైకసి. వీళ్ళ సంతానం రావణుడు , కుంభకర్ణుడు , విభీషణుడు , సూర్పణఖ. రావణుడు, నరకాసురుడు, కర్ణుడు లాంటి వారిని రోజు రోజుకూ కీర్తిన్చేవారు ఎక్కువైపోతున్నారు. మన గ్రంధాలనూ , అందులో ఉన్న దేవుళ్ళను అవమానపరుస్తూ, వాటిలో ఉన్న రాక్షసులకు పట్టం కడుతూ వికృత చేష్టలు చేస్తుంటే మనం ఏమిచేయలేని స్థితిలో ఉన్నాం.ఇందుకు కారణం లేకపోలేదు మనం మన పురాణాలను, ఇతిహాసాలను పూర్తిగా తెలుసుకోకపోవడమే ... ఇలానే ఉంటే మరో దశాబ్దానికి మన వారే మన పురాణాలను ప్రశ్నించే రోజు వస్తుంది ... రోజులో కనీసం ఒక అరగంట కేటాయించి ఇంట్లోని పిల్లలకు మన రామాయణం, మహా భారతం, భాగవతం మొదలగు గ్రంధాలను చెప్తే మన ధర్మం.

 

రాముడి ప‌ద్ధాలుగేళ్ళ అర‌ణ్య వాసంలో రావ‌ణుడు సీత‌ను ఎత్తుకెళ్ళ‌డం గురించి అంద‌రికీ తెలిసిందే. రాముడు రావ‌ణుడ్ని వ‌ధించి సీత‌ను వెన‌క్కు తెచ్చుకోవ‌డం ఇవ‌న్నీ పురాణ క‌థ‌లు. రావ‌ణుడు సీత‌ను త‌న ద‌గ్గ‌ర నిర్భందించాడుగాని సీత‌ను మాత్రం ఎన్న‌డూ క‌నీసం తాక‌లేదంట‌. అందుకు కార‌ణాలు లేక‌పోలేదు. అత‌ను ఓసారి స్వ‌ర్గానికి వెళ‌తాడ‌ట‌. అక్క‌డ రంభ‌ను చూసి మ‌న‌సుపారేసుకుంటాడు.

 

త‌న‌తో గ‌డ‌పాలంటూ ఆమెను బ‌ల‌వంతం చేస్తాడు. అందుకు రంభ స‌సేమిరా అంటుంది. అయినా రావ‌ణుడు వ‌దిలిపెట్ట‌కుండా ఆమె వెంట ప‌డ‌తాడు. ఇది చూసిన రంభ ప్రియుడు న‌ల‌కుభేరుడు రావ‌ణుడికి శాపం పెడ‌తాడు. ఇష్టం లేక‌పోయినా ఎవ‌రైనా యువ‌తులను ముట్టుకోవాల‌ని చూస్తే వారి త‌ల‌లు ప‌గిలిపోతాయ‌ని అంటాడు. దీంతో రావ‌ణుడు వెన‌క్కి త‌గ్గుతాడు. అందువ‌ల్లే సీత‌ను ఎత్తుకెళ్ళినా క‌నీసం తాక‌ను కూడా తాక‌లేక‌పోయాడు. దీని వెనుకున్న అస‌లు కార‌ణం ఇది. 

మరింత సమాచారం తెలుసుకోండి: