ఈశ్వరుడు జగదీశ్వరుడైన శివుడు  అన్ని  శైవ క్షేత్రాలలో లింగా రూపంలో దర్శనమిస్తూ , అభిషేకాలు అందుకుంటాడు. కొన్ని శివాలయాలలో శివుడు విగ్రహ రూపంలో దర్శమిస్తాడు. కాని ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ ఆలయం పేరుకి శివాలయమే కాని శివలింగము మాత్రం కనిపించదు...ఈ అరుదైన శైవ క్షేత్రానికి భక్తులు శివరాత్రి సమయంలో తండోప తండాలుగా వెళ్తూ ఉంటారు..అసలు శివలింగం లేకుండా రూపుదిద్దుకున్న ఆ ఆలయం ఎక్కడ ఉంది..ఆ ఆలయ చరిత్ర  విశేషాలు పరిశీలిస్తే...

 

కేరళ రాష్ట్రంలోని త్రిశూర్ జిల్లాలో ఈ ఆలయం కలదు. ఎందరో కవులు, సాహితీవేత్తలు పుట్టిన ప్రదేశం కావడంతో దీనిని కేరళ యొక్క సాంస్కృతిక రాజధానిగా అభివర్ణిస్తారు. అయితే ఇక్కడి వడ్డంక్కునాథన్ శివాలయం మహాశివుడికి అంకితం ఇచ్చారు. ఈ ఆలయాన్ని పరశురాముడు నిర్మించారనేది స్థలపురాణం. ఆలయం నిర్మించారు బాగనే ఉంది, శివలింగాన్ని ప్రతిష్టించలేదా, అన్న అనుమానం ఉంది కదా.. అసలు విశేషం ఏమిటంటే...ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్టించారు కానీ లింగం కనిపించక పోవడానికి గల కారణం ఏమిటంటే..

 

ఈ ఆలయంలోని శివలింగాన్ని వేలాది భక్తులు గడిచిన వందల ఏళ్ళుగా పూజిస్తూ  నెయ్యితో అభిషేకాలు నిర్వహించారు. దాంతో  ఆ నెయ్యి  పెద్ద గుట్టగా మారి సుమారు అయిదారు మీటర్ల ఎత్తులో పేరుకుపోయి శివలింగాన్ని పూర్తిగా కప్పేసిందట...మరి నెయ్యి కరిగిపోతుంది కదా అనే సందేహం రావచ్చు..అయితే సాధారణంగా మంట ఉండే చోట నెయ్యి ఉంటే కరిగిపోతుంది..వాసన వెదజల్లుతుంది. కాని...

 

మండే ఎండల్లో కూడా ఈ నెయ్యి గుట్ట కరగదు, వాసనను వెదజల్లదు. అందుకే ఈ దివ్య లింగ భక్తులకి దర్సనం కేవలం నెయ్యి రూపంలోనే కనిపిస్తుంది. ఇప్పటి వరకూ ఈ నెయ్యి కరగక పోవడానికి కానీ లేదా సువాసనలు రాకపోవడానికి గానీ కారణాలు రహస్యాలుగా ఉండిపోయాయి. ఇంకా ఈ  ఆలయ విశేషాలు ఏమిటంటే. ఏడాది వయసున్న చిన్నపిల్లలను గుడిలోనికి ప్రవేశించనివ్వరు. ఈ గుడిని ధర్శించాలంటే సాంప్రదాయ వస్త్ర ధారణలోనే వెళ్ళాలి. మహాశివరాత్రి రోజున ఇక్కడ భక్తులు లక్ష దీపాలు వెలిగించి తమ జీవితాలు కూడా ఇలాగే వెలుగొందాలని ప్రార్ధిస్తారు. ఇదిలా ఉంటే శివలింగం కనిపించని ఏకైక శివాలయం ప్రపంచంలో ఇదొక్కటే కావటం విశేషం...

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: