మహాశివరాత్రి.. హిందువులకు పెద్ద పండుగా.. స్కూల్స్ లో పిల్లలకు ఇచ్చిన హాలిడేస్.. ఆఫీస్ లో ఉద్యోగులకు ఇవ్వరు. ఇది ఎందుకు చెప్తున్నా అంటే? ఇది కూడా ఒక రకంగా పాపమే మరి. పండుగ రోజు కుటుంబంతో ఉండనివ్వకుండా ఆఫీస్ కి రమ్మనే ప్రతి బాస్ కు ఈ పాపం తగులుతుంది అని ఓ నెటిజన్ ఆవేధన వ్యక్తం చేశాడు. 

 

ఇక ఈ బాబు ఆవేదన గురించి పక్కన పెడితే.. మహా శివరాత్రిని ఎంతోమంది భక్తులు ఎంతో నిష్ఠగా చేస్తారు. అలాంటి ఈ శివరాత్రి రోజు ఎన్నో నియమాలు పాటిస్తారు. ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. ఎక్కడ తప్పు జరగకాకుండా జాగ్రత్తలు పడుతారు. అయితే ఆ జాగ్రత్తలు అన్ని పాటించేసరికి కొంచలం అలసట అయితే వస్తుంది. 

 

ఇక శివరాత్రి అని చాలామంది భక్తులు పెద్ద తప్పు చేస్తారు. ఆ తప్పు ఏంటి అంటే ? ఉదయం లేచి స్నానం చేసి గుడికి వెళ్లి ఉపవాసం ఉంటారు. సాయింత్రం 6 గంటలు అవ్వగానే ఆ ఉపవాసంను వదులుతారు. ఇక అలా ఉపవాసం అయిపోగానే కడుపు నిండా భోజనం చేసి.. జాగారం ఉండాల్సిన సమయంలో నిద్రపోతారు. ఆలా చెయ్యడం వల్ల ఉపయోగం ఏంటి? అసలు ఉపవాస దీక్షను 24 గంటలు పాటించాలి. నిద్రపోకూడదు. అదే కదా మహా శివరాత్రి అంటే. అలాంటి ఈ శివరాత్రి రోజు అలా ఉపవాసం విరమించి నిద్ర పోవడం వల్ల ఎంతో పాపం. అందుకే ఉపవాసం చేసి నిద్రపోకండి. అది ఎంతో పాపం. 

మరింత సమాచారం తెలుసుకోండి: