శివరాత్రి పర్వదినం సందర్భంగా శైవ క్షేత్రాలన్ని శివన్నామ స్మరణతో మారుమోగుతున్నాయి. భక్తులు మహా శివుడి దర్శనానికి ఆయన కొలువై ఉన్న వివిధ క్షేత్రాలకు తరలి వెళుతున్నారు. భక్త సులభుడైన మహా శివుడు ఒక్కో క్షేత్రం  ఒక్కో విశిష్ట మహిమతో భక్తులను అనుగ్రహిస్తుంటాడు. అలాంటి ఓ మహా మహిమాన్విత పుణ్య క్షేత్రమే కొటప్పకొండ.

 

గుంటూరు జిల్లా నరసరావు పేటకు సమీపంలో ఉన్న కోటప్ప కొండపై ఎన్నోవిశేషాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ క్షేత్రం లో మనకు కాకులు కనిపించవు. కొండ ఎక్కుతున్నప్పుడు దారిలో అనేక కాకులు కనిపించినా కొండపై మాత్రం ఒక్క కాకి కూడా మనకు ఉండదు. ఇప్పటి వరకూ ఈ కొండ పై కాకులు వాలిన దాఖలాలు లేవు.కోటప్ప కొండను ఎటు వైపు నుంచి చూసినా మూడు శిఖరాలు కనిపిస్తాయి. ఈ మూడు శిఖరాలను బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు గా భావిస్తారు. అందుకే ఈ కొండను త్రికుటేశ్వరం గా, ఇక్కడ కొలువైన స్వామి వారిని త్రికుటాచలేశ్వరుని గా, త్రికోటేశ్వరుడి గా కొలుస్తారు.

 

మహాశివరాత్రి, కార్తీక మాస సమయాల్లో కోటప్ప కొండ క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతుంది. శివుడు దక్షిణామూర్తి గా, బ్రహ్మచారి గా వెలిసిన ఈ శిఖరంలో అమ్మవారి దేవాలయాలు ఉండవు. కాబట్టి ఇక్కడ పెళ్లిళ్లు కూడా జరగవు. ఈ ఆలయానికి ధ్వజ స్తంభం కూడా ఉండడకపోవటం మరో విశేషం పరమ శివుడు దక్షిణామూర్తి స్వరూపంతో ఉన్న ఏకైక క్షేత్రం తెలుగు రాష్ట్రాల్లో ఇదొక్కటే.

 

ఇక్కడ మహాశివుణ్ణి పూజిస్తే జాతకంలో గురుబలం పెరుగుతుందని చెబుతారు. గురుబలం కారణంగా ఇతర గ్రహాల ప్రభావం ఆ మనిషిపై పడకుండా రక్షణ పొందుతాడని ప్రతీతి. అందుకే గురుగ్రహం అనుగ్రహం పొందాలంటే కోటప్ప కొండ వెళ్లి త్రికుటేశ్వరున్ని సేవించాలని అంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: