హోలీ.. ఈ పండుగ వచ్చింది అంటే పిల్లల నుండి పెద్దల వరుకు ప్రతి ఒక్కరికి ఎక్కడలేని సంతోషం.. ఎక్కడలేని ఉత్సాహం. ఎందుకంటే హోలీ పండుగలో ఏలాంటి బేధాలు ఉండవు కనుక.. కుల మత.. పేద ధనిక లాంటి భేదాలు లేకుండా హోలీ పండుగ అందరూ జరుపుకుంటారు. ఒక్క భారత దేశంలోనే కాదు ఈ పండుగను నేపాల్, బాంగ్లాదేశ్ వంటి దేశాల్లో కూడా ఘనంగా జరుపుకుంటారు. 

 

అయితే హోలీ పండుగ ఎందుకు చేసుకుంటారు అనేదానికి మనం ప్రతి నిత్యం హిరణ్యకశపుని,, ప్రహ్లదుడు, హోలీక కథ వింటూ ఉంటాం. అలాంటి ఈ కథ అయితే హోలిక ప్రహల్లాదుడుని చంపాలని చూసి ఆమె అగ్నికి ఆహుతి కావడం వల్ల హోలీ పండుగ చేసుకుంటారు అనేది కథ మనందరికీ తెలుసు. 

 

ఇకపోతే ఈ హోలీ పండుగ ఎలా పుట్టింది అనేది మాత్రం చాలామందికి తెలియదు. అయితే అది ఎలా పుట్టింది అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. బెంగాల్ లో చెప్పిన కథ ప్రకారం.. శ్రీకృష్ణుడు గోపికలతో కలిసి బృందావనంలోని పువ్వులతో, రంగులతో ఈ ఉత్సవాన్ని జరుపుకున్నాడు అని.. అలా రంగులు, పూలు చల్లుకోవడం ద్వారా ప్రేమ, సౌభాగ్యాలు వెల్లివిరిస్తాయని నమ్ముతారు. అలానే హోలీ పుట్టింది అని ఓ కథ కూడా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: