కర్ణి మాతా దేవాలయం.. రాజస్థాన్ లోని బికనేర్ కు 30 కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం ఉంది. ఈ దేవాలయంలో దుర్గా దేవత అవతారమైన కర్ణి మాత పూజించబడుతుంది. ఈ కర్ణిమాత దేవాలయాన్ని ఎలుకల దేవాలయం అని కూడా అంటారు. డెష్నోక్ లో పర్యాటకులకు ఇది ప్రధాన ఆకర్షణ. ఇతిహాసాలమేరకు, రావు బికాజీ, అంటే బికనీర్ నగరం నిర్మాతకు కర్ణిమాత అనుగ్రహం దొరుకుతుంది. అప్పటినుండి ఆ మాతను బికనీర్ వంశ పాలకులు కొలుస్తారు.

 

ఇక సాధార‌ణంగా ఏ దేవాలయంలోనైనా దేవుడు లేదా దేవతను ఆరాధిస్తారు. అయితే క‌ర్ణి మాతా దేవాల‌యంలో మాత్రం ఎకలను దేవుళ్లుగా భావించి పూజలు చేస్తారు. అంతే కాదు సదరు ఎలుకలు తిని వదిలిన ఆహారాన్ని తమ ప్రసాదంగా భావించి ఆ ఆహారాన్ని తింటారు. ఈ దేవాలయంలో సుమారు 20,000 నల్ల ఎలుకలు సజీవంగా ఉన్నాయని ప్రసిద్ధి. ఈ ఎలుకలు దేవాలయం అంతా తిరుగుతుంటాయి. ఈ ప్రసిద్ధ ఎలుకలను కబ్బాలు అని పిలుస్తారు. 

 

ఈ ఎలుకలు దైవత్వ ఎలుకలుగా ఆ గ్రామస్థులు పూజిస్తారట. మ‌రి ఈ ఎలుకలు ఎప్పటి నుంచి ఇక్కడ ఉన్నాయి అన్న దానికి సరైన సమాధానం మాత్రం లభించడం లేదు. ఇక ఈ దేవాలయం 20వ శతాబ్దంలో రాజు గంగా సింగ్ చే నిర్మించబడింది. ఈ దేవాలయంలో మార్బుల్ చెక్కడాలు చాలా కలవు. ప్రవేశ ద్వారం గేటు చాలా పెద్దది. ఇది వెండితో చేయబడింది. ఈ దేవాలయాన్నిసందర్శించడానికి అనేక మంది యాత్రికులు వస్తూంటారు. ఆసక్తి గల పర్యాటకులు ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ దేవాలయాన్ని సందర్శిస్తుంటారు.

 

 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: