ప్రపంచంలో భారతీయులు ఎక్కడ ఉన్నా వారి ఇంట్లో ఎక్కడో అక్కడ సాయిబాబ ఫోటో తప్పకుండా ఉంటుంది.  సాయినాథుడు అంటే అంత భక్తి.. విశ్వాసం.  సాయిబాబా అసలు పేరు, జన్మ స్థలం తెలియదు. కానీ.. సాయిబాబాను అనేకులు ముస్లింలు, హిందువులు కూడా సాధువుగా నమ్ముతారు. అల్లా మాలిక్ అని అనే ఆయన వేంకటేశుడిని కూడా నమ్ముతారు.  మనుషుల మద్య ఉంటూ వారి కష్టాలు తన కష్టాలుగా భావించి వారిని భక్తి మార్గంలో నడిపించారు.  సాయిబాబా బోధనలో ప్రేమ, కరుణ, దానం, సంతృప్తి, శాంతి, దైవారాధన, గురుపూజ ముఖ్యమైనవి. అద్వైతం, భక్తి మార్గం, ఇస్లాం సంప్రదాయాలు సాయిబాబా బోధనలలోనూ, జీవనంలోనూ మిళితమై ఉన్నాయి.

 

ఎంతో మంది, ప్రధానంగా మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలనుండి సాయిబాబాను దైవ స్వరూపునిగా గుర్తించి ఆరాధిస్తున్నారు. అందుకే దేశ వ్యాప్తంగా షిరిడీకి వచ్చి ఇప్పటికీ సాయినాథుడిని సన్నిధిలో సాంత్వన పొందుతున్నారు.  1858లో చాంద్ పాటిల్ కుటుంబపు పెళ్ళివారితో కలిసి బాబా షిరిడీ వచ్చారు. అక్కడ ఖండోబా మందిరం దగ్గర బాబా బండి దిగినప్పుడు మందిరం పూజారి మహాల్సాపతి  "రండి సాయీ" అని పిలిచాడు. తరువాత 'సాయి' నామం స్థిరపడి ఆయన "సాయిబాబా"గా ప్రసిద్ధుడైనారు. 1918లో తన సమాధి వరకు సాయిబాబా షిరిడీలోనే ఉన్నారు. ఒక పాత మసీదును తన నివాసం చేసుకొన్నారు. మసీదులో ధునిని వెలిగించారు.

 

అందులోనుండి విభూతిని తీసి తన దర్శనానికి వచ్చేవారికి పంచేవారు. అది వ వారికి రక్షణ ఇస్తుంది.వచ్చిన వారికి ఉపదేశాలు, ధర్మ బోధలు చేసేవారు. చాలా మహత్తులు చూపించారు.  తన దైనిక వ్యవహారాలలోను, బోధనలలోను సాయిబాబా హిందూమతానికి చెందిన సంప్రదాయాలనూ, ఇస్లాం సాంప్రదాయాలను పాటించారు. ఇంకా సాయినాథుడు ప్రతి ఇంటికి వెళ్లి బిక్షాటన చేసి వారి పాపాలను ప్రక్షాలన చేసేవారని అలా ఎన్నో లీలలు సాయినాథుడు చేశారని చెప్పుకుంటారు.  అందుకే ప్రజలు ఆయనను దైవంగా చూస్తారని అంటారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: