తిరుమ‌ల తిరుప‌తి వెంక‌న్న భ‌క్తుడు హ‌థీరాంజీ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఆయ‌న వెంకేట‌శ్వ‌ర స్వామికి ఎంత భక్తుడో. ఇక హాథీరాంజీ విష‌యానికి వ‌స్తే క్రీ.శ. 1500 కాలంలో ఉత్తర భారత దేశంనుండి తిరుమలకు వచ్చిన భక్తుడు. ఆయ‌న‌తో పాటు చాలా మంది యాత్రికులు తిరుమ‌ల‌కు వ‌చ్చారు. అయితే ఆ త‌ర్వాత స్వామివారిని చూశాక ఆయ‌న‌కు స్వామి సేవ చేసుకుంటూ ఇక్క‌డే ఉండిపోయారు. మిగిలిన భ‌క్తులు వెళ్లిపోయినా హ‌థీరాంజీ మాత్రం తిరుమ‌ల‌లో స్వామి సేవ‌కు అంకితమ‌య్యారు.



ఇతడు స్వామివారితో పాచికలాడేంత సన్నిహిత భక్తుడని కథనాలున్నాయి. పాచికలాటలో వెంకటేశ్వరుడు ఓడిపోయాడని అందుకే తిరుమలలో హథీరాంజీ మఠం, ప్రధాన ఆలయం కన్నా వంద మీటర్ల ఎత్తులో ఉన్నదని ఒక కథనం. ఇక ధ‌గ‌ధ‌గాయ మానం క‌లియుగ వెంక‌టేశ్వ‌రుని వైభ‌వం గురించి ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చిందంటే అందుకు హ‌థీరాం బాబా మ‌ఠం గురించి త‌ప్ప‌కుండా ప్ర‌స్తావించాల్సిందే. బ్రిటీష‌ర్లు దేవాల‌యాల నిర్వ‌హ‌ణ‌లో జోక్యం చేసుకోకూడ‌ద‌ని నిర్ణ‌యించుకున్న త‌ర్వాత తిరుమ‌ల దేవాల‌యం హ‌థీరాం జీ మ‌ఠం నిర్వ‌హ‌ణ కింద‌కు వ‌చ్చింది.



ఇక శ్రీకృష్ణ దేవ‌రాయుల పాల‌నా కాలం నుంచి కూడా భ‌క్తులు స్వామి వారికి ఇచ్చే ఖ‌రీదైన కానుక‌లు, న‌గ‌లు సైతం ఈ మ‌ఠం కింద ఉన్న ర‌హ‌స్య గదుల్లోని నేల‌మాలిగ‌ల్లో ఉన్నాయ‌న్న క‌థ‌నాలు ఉన్నాయి. ఇటీవ‌ల శ్రీకాళ‌హ‌స్తి ఈవో ఈ మ‌ఠం త‌లుపులు తెర‌వ‌డంతో దీని గురించి ప్ర‌పంచానికి తెలిసింది. ఇక ఈ మ‌ఠం ప‌రిధిలో వంద‌ల కోట్ల విలువ చేసే ఖ‌రీదైన ఆస్తులు దేశం అంత‌టా ఉన్నాయి. ఇక వంద‌ల ఏళ్లుగా భ‌క్తులు ఇచ్చిన కానుక‌లు ఉన్నాయి. ఈ మ‌ఠం 120 ఏళ్ల క్రింద‌ట నిర్మించారు. ఇక ఈ న‌గ‌లు ఉన్నాయ‌న్న వాద‌న‌లు మ‌రింత బ‌ల‌ప‌డ‌డంతో కేర‌ళ‌లోని అనంత ప‌ద్మ‌నాభ ర‌హ‌స్య‌నిధికి ఎలా ర‌క్ష‌ణ క‌ల్పించారో.. ఇప్పుడు మ‌ఠం లోప‌ల ఉన్న నేల మాళిగ‌లు అన్నింటికి ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని ప‌లువురు భ‌క్తులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విష‌యంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాల‌ని కోరుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: