హిందువుల పండుగ ఉగాది. ఉగాది పండుగ తెలుగు వారి తొలి పండుగ. ఈ పండుగ రోజు చేపట్టాలనుకునే పనులని మొదలు పెడతారు. అలానే ఈ పండుగ రోజు ప్రతి ఒక్కరు ఉగాది పచ్చడిని తయారు చేసుకుంటారు. జీవితం లో కష్టం, సుఖం శాశ్వతం కాదు . ఓసారి కష్టం ఎదురైతే మరో సారి సుఖంగా ఉంటారు. కాబట్టి మన జీవితంలో ఎదురయ్యేది ఏమైనా చక్కగా సంయమనం తో ప్రతి ఒక్కరు స్వీకరించాలి అని మన ఉగాది పచ్చడి సూచిస్తుంది .

 

IHG

 

ఎవరి స్టైల్లో వాళ్ళు ఈ పచ్చడిని తయారు చేస్తారు. అయితే ఈ పచ్చడి లో  చెరకు అరటి పళ్ళు ,మామిడి కాయలు, చింతపండు,వేప పువ్వు , జామ కాయలు, బెల్లం వగైరా పదార్దాలను ఉపయోగిస్తారు. ఉగాది పచ్చడి చేయు విధానం:

ఉగాది పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. కేవలం ఆ ఒక్క రోజునే దీనిని చేసుకుంటారు. షడ్రుచులు ఇందులో ఉండడం వల్ల ఎంతో రుచిగా ఉంటుంది.

ఈ పచ్చడికి కావాల్సిన పదార్ధాలు:

చింతపండు
బెల్లం
వేప పువ్వు
మామిడి కాయ
ఉప్పు
కారం
బెల్లం
కొబ్బరి పొడి
శనగట్నాల పొడి


ఉగాది పచ్చడి చేయు విధానం:

చింతపండు లో నీళ్లు పోసి పులుసు  తీయాలి. ముందు  ఆ అరటి పండు ముక్కలాగా తరిగి దానిలో వెయ్యాలి. మామిడి కాయని  చిన్న ముక్కలాగా తరిగి వేసుకోవాలి. బెల్లం పొడి, కొబ్బరి కోరు, కారం, ఉప్పు, శనగట్నాల పొడి, చెరకు ముక్కలు, చింతపండు  లో బెల్లం  వేసి ఇందులో కలపాలి. చివరగా వేప పువ్వు కూడా దీనిలో వేసి బాగా కలుపుకోవాలి. ఇంకేం ఉంది షడ్రుచుల పచ్చడి రెడీ.

 

మరింత సమాచారం తెలుసుకోండి: