తెలుగు సంవత్సరాది అయినటువంటి ఉగాది పండుగ వచ్చిందంటే చాలు.. మనవాళ్ళు.. ముఖ్యంగా మన తెలుగు వారు.. మామిడాకులతో తోరణాలు, రకరకాల రంగవళ్లులు, పిల్లల అల్లరి చేష్టలు, పెద్దల హడావుడి, కొత్త బట్టలతో ఇంచుమించు అందరి ఇళ్లు కళకళలాడుతూ ఉంటాయి. పల్లెటూళ్లలో అయితే ఇక చెప్పనవసరం లేదు. ఉగాది పండుగ రోజు నుంచి, శ్రీరామనవమి వరకు ఏడు రోజుల పాటు చాలా ఘనంగా ఉత్సవాలు జరుపుతుంటారు.

 

రుచి, శుచి లేని వంట, అభిరుచి లేని జీవితం.. వ్యర్ధము అని నానుడి.. అసలు రుచి అంటే ఏమిటి? ఆ రుచిని ఎలా తయారు చేసుకోవాలి? వేటిని కలుపుకోవాలి? ఎలా రంగరించు కోవాలి? ఎలా సమతుల్యం చేసుకోవాలి? ఇవన్నీ తెలిస్తే.. నిజంగానే ప్రతి ఒక్కరి జీవితం, అభిరుచుల సమ్మేళనమే. ఇంకా.. మన ఉగాది పండగ భాషలో చెప్పాలంటే జీవితం షడ్రుచుల సంగమం.

 

షడ్రుచుల మిళితమైన శ్రేష్ట పదార్ధమే ఉగాది పచ్చడి. ఆధ్యాత్మిక పరంగా ఈ పచ్చడికి ఎంత ప్రాముఖ్యత కలదో.. ఆహార, ఆరోగ్యం పరంగాను అంతే ఉన్నత స్థానాన్ని కలిగి ఉంది. ఈ పచ్చడి సేవించడం ద్వారా దివ్యమైన ఆరోగ్యం కలుగుతుందని వైద్యనిపుణుల మాట. ఇక షడ్రుచులు.. ఈపేరు వినటమే గాని, ఆ రుచులేమిటో చాలా మందికి నిజంగా తెలియదు. ఆహారము తినడము జీవించడానికి ఒక ఇంధనము. వ్యాధి రాకుండా ఉండడానికి ఆహారము అవసరము కనుక దానిని బ్రహ్మపదార్ధముతో సంధానించి "అన్నం పరబ్రహ్మ స్వరూపం" అన్నారు పెద్దలు.

 

ఆహారమునుండే ఆరోగ్యము , అనారోగ్యము పుడుతుంటాయి అని వైద్యులు చెబుతూవుంటారు. జీవరాసులన్నింటికీ ఏదో రకమైన ఆహారము వాటి జీవనానికి మూలాధారము. నిజానికి రుచులు అనేక రకాలు ఉన్నప్పటికీ మన ఆయుర్వేదము ఆరు రుచులు అని  చెపుతుంది. వాటినే షడ్రుచులు అంటారు.

 

షడ్రుచులు - Six Tastes...
తీపి - Sweet  ఉదా: పంచదార, తేనె
పులుపు - Sour  ఉదా: నారింజ, నిమ్మకాయ
చేదు - Bitterness  ఉదా : వేప, పసుపు, మెంతులు
కారం - Chili  ఉదా : మిరప, మిరియాలు
వగరు - Acrid  ఉదా : చిక్కుడు, కాలీఫ్లవర్, మినప పప్పు
ఉప్పు - salt  ఉదా : సముద్రపు నీరు, సైందవ లవణము

మరింత సమాచారం తెలుసుకోండి: