ఉగాది అనగానే మన తెలుగు ఏడాది ప్రారంభం. తెలుగు ప్రజలు అందరూ మతాలకు సంబంధం లేకుండా కులాలకు సంబంధం లేకుండా ఈ రోజుని జరుపుకుంటారు అనేది వాస్తవం. ఉగాది అనగానే బంధు మిత్రులను అందరిని ఇళ్ళకు పిలవడం, ఘనంగా చేసుకోవడం వంటివి ప్రతీ ఒక్కటి చాలా జాగ్రత్తగా చేసుకుంటారు. తెలుగు సాంప్రదాయాలను పాటిస్తూ ఏదీ లోటు లేకుండా చేసుకుంటారు. 

 

అయితే ఈ ఏడాది ఉగాది విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు నిపుణులు. ఉగాది అనగానే బంధు మిత్రులు అందరూ వస్తారు కాబట్టి ఇల్లు సందడి సందడి గా ఉంటుంది. కాని అది అంత మంచిది కాదని హెచ్చరిస్తున్నారు. కరోనా ఉంది కాబట్టి ప్రజలు అందరూ కూడా జాగ్రత్తగా దానిని జరుపుకోవాలని సూచిస్తున్నారు. ఎవరిని పడితే వాళ్ళను ఇళ్ళకు పిలవకుండా ఉంటే మంచిది అంటున్నారు. 

 

ఇంట్లో వాళ్ళ వరకు చేసుకుంటే మంచిది అంటున్నారు. ప్రస్తుతం కరోనా ఒకరి నుంచి మరొకరికి వేగంగా అంటుకుంటుంది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. మనకు రోగ నిరోధక శక్తి ఉన్నా సరే అది ఒక్కసారి వస్తే తట్టుకోవడం కష్టం అని అంటున్నారు. ప్రభుత్వం కూడా దీనిని అధికారికంగా నిర్వహించే పరిస్థితి ఎక్కడా కనపడటం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: