ఉగాది అనగానే మనకు అత్యంత పవిత్రమైన పండగలలో ఒకటి. తెలుగు వారు అందరూ కూడా సంతోష౦గా జరుపుకునే పండుగ ఉగాది. ఆ రోజున అసలు ఎం చెయ్యాలి...? ఉగాది రోజు వేకువ జామునే లేచి నిత్యం చేసే పనులు ముగించుకుని స్నాన సంధ్యలు కానిచ్చి ఉగాది పచ్చడి చేసుకోవడం అనేది మనకు సాంప్రదాయంగా వస్తుంది. పలు రకాల పిండి వంటలతో  అమ్మవారికి, విష్ణు మూర్తి కి  నైవేద్యం సర్పిస్తారు మన వాళ్ళు. 

 

దగ్గరలో ఉండే దేవాలయంలో ఏర్పాటు చేసే పంచాంగ శ్రవణంకి వెళ్తారు. ఆ రోజున ఉగాది పచ్చడి కొంచెం అయినా తీసుకోవాలి. ఉగాది పచ్చడి మాదిరిగానే మన జీవితం కూడా షడ్రుచుల సమ్మేళనం అని దాని ద్వారా తెలుసుకోవచ్చు.      ఉగాది రోజు నుంచే చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ రోజు మిత్ర దర్శనం కూడా చేస్తారు. అంటే ఎవరి జీవితాల్లో వారు బిజీగా ఉంటారు. అందుకే ఇటు వంటి ఒక సంప్రదాయం ఏర్పాటు చేయడంతో కనీసం ఈ ఒక్క రోజైనా మిత్రులను కలిసి ఆనందం గా గడుపుతారని దీని పరమార్ధంగా చెప్పవచ్చు.

 

ఉగాది రోజు ఆర్య పూజ అనే ఒక సాంప్రదాయం కూడా ఉంది. దాని అర్ధం పెద్దలను పూజించడం. ఈ రోజు చేయవలసిన మరొకటి గో పూజ . హిందూ సంప్రదాయంలో గోవును పూజించడం అనేది అనాదిగా వస్తున్న ఆచారం అనే సంగతి అందరికి తెలిసిందే. భారత దేశం లో గోవును దేవతగా చూస్తారు భక్తులు. ఉగాది రోజు తప్పనిసరిగా గోమాతను పూజించాలని సాంప్రదాయం చెప్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: