ప్రతి పండుగకి ఒక విధానం ఉంటుంది. తప్పని సరిగా పాటించాల్సినవి, తప్పక శ్రద్ధగా చేయాల్సినవి. ఆ రోజు మాత్రమే చేసేవి ఇలా ఎన్నో ఉంటాయి. అయితే వీటిని పాటించడం అవసరం. నిన్న మొన్న పుట్టినవి కాదు మన సాంప్రదాయాలు. తరాల నుండి వస్తున్నవే. వీటిని ఫాలో అవ్వడం ఎంతో ముఖ్యం. అయితే ఉగాది పండుగకి ఎంతో విశిష్టత ఉంది.

 

IHG

 

 

తరతరాల పద్ధతులు కూడా అనుసరించాలి. ఉగాది రోజున షడ్రుచుల పచ్చడిని చేసుకోవాలి. అలానే పంచాంగ శ్రవణమ్, ఆర్య పూజానం, గోపూజ, మిత్ర దర్శనమ్ వంటి ఈ ఆచారాల్ని తప్పక పాటించాలి. ఇవి ఉగాదికి అత్యంత ముఖ్యమైనవి. పంచాంగ శ్రవణం చెప్పించుకోవడం, సంవత్సరానికి తగ్గ ప్రణాళికని వేసుకుని నడుచుకోవడం చేస్తూ ఉంటారు. కాబట్టి పంచాంగ శ్రవణం ని తెలుసుకుని దాని క్రమం లో పాటిస్తారు.

 

కాబట్టి తెలుగు సంవత్సరం  లో మొదటి రోజైన ఉగాది నాడు పంచాంగ శ్రవణం ని వినడం ఆనాటి నుండి వస్తున్నదే. అలానే కవి సమ్మేళనం కూడా ఆచారమే. ఇది లేక పోతే అందమే లేదు ఏమో. కవి సమ్మేళనం నాడు కవులంతా  కలిసి కవితా పఠనం చేస్తారు. ఇది కూడా ఉగాది పర్వదినం నాడు చెయ్యాల్సిన ఆచారం. కాబట్టి ఉగాది రోజు ఇవి ఉంటేనే అందం.

 

IHG

 

 

అలానే గుమ్మలకి తోరణాలు, ఉగాది పచ్చడి, పంచాంగ శ్రవణమ్, ఆర్య పూజానం, గోపూజ, మిత్ర దర్శనమ్ కూడా ఉగాది పండుగకి ఎంతో అందాన్ని ఇస్తాయి. సాధారణంగా అన్ని రోజులు చేసుకునేవి కాదు కాబట్టి ఉగాది నాడు ప్రత్యేకముగా వీటిని పాటిస్తారు. తరతరాల నుండి వస్తున్న ఈ సంప్రదాయాలు, ఆచారాలు ఈ తెలుగు సంవత్సరాదికి ఎంతో అందం.

మరింత సమాచారం తెలుసుకోండి: