దేశ వ్యాప్తంగా 21 రోజులు లాక్ డౌన్ ప్రకటించిన నేపధ్యంలో అందరూ ఉగాదిని ఇంటి వరకే పరిమితం చేసారు. ఎవరూ కూడా ఇంటి నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేయడం లేదు. గుడికి వెళ్ళే వాళ్ళు కూడా ఇంటి నుంచి ఉగాదిని జరుపుకుంటున్నారు. బంధు మిత్రుల సందడి లేకపోవడం తో ఉగాదిని జరుపుకుంటున్నారు. ఇంటికి మాత్రమే పరిమితం అయ్యారు అందరూ. 

 

చాలా మంది గుడికి వెళ్ళే వాళ్ళు ఇంట్లోనే దేవుడ్ని పెట్టుకుని పూజ చేసుకుంటున్నారు. బయటకు వెళ్తే పోలీసులు ఊరుకోకపోవడం తో ఇప్పుడు అందరూ కూడా తమ వద్ద ఉన్న వాటి తోనే పండగ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఉగాది పచ్చడి అందుబాటులో ఉంటేనే చేసుకుంటున్నారు. లేకపోతే మానేస్తున్నారు. మిత్రులకు సహా అందరికి ఫోన్ చేసి విష్ చేస్తున్నారు గాని కలవడానికి ఎవరూ ఇష్టపడటం లేదు. 

 

తెలుగు రాష్ట్రాల్లో ఉగాది ఘనంగా చేసుకునే పరిస్థితి ఉంటుంది. కాని ఈ సారి మాత్రం మళ్ళీ వచ్చే ఏడు ఉగాది చేసుకోవాలి అంటే ఈ ఏడాది జాగ్రత్తగా ఉండాలని అర్ధం చేఉకుని అందరూ ఇంటికి పరమితం అయిపోయారు. పిల్లలను కూడా పెద్దగా బయటకు పంపడం లేదు. ఎక్కడో గ్రామాల్లో మినహా ఎవరూ బయటకు వచ్చే పరిస్థితి లేదు. నగర ప్రాంతాల్లో రోడ్లు అన్నీ కూడా నిర్మానుష్యంగా మారిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: