ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రాలలో శబరిమల ఒకటి. శబరిమలలో కొలువైవున్న అయ్యప్ప స్వామి క్షేత్రం, దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధిగాంచినది. హరిహర సుతుడు అయ్యప్ప. పద్దెనిమిది కొండల మధ్యలోని శబరిగిరి శిఖరంపై చిన్ముద్రధారిగా కొలువైన ఆ స్వామి దర్శనం కోసం భక్తులు దీక్ష చేపడతారు. అయితే శబరిమలలో మనకి వావర్ మసీదు కనిపిస్తుంది. మరి ముస్లిం అయినా వావర్ కి స్వయానా అయ్యప్ప స్వామియే శబరిమలలో అతనికి మసీదు కట్టమని చెబుతాడు..?

 

మ‌రి అయ్య‌ప్ప అలా ఎందుకు చెబుతాడు..? అసలు వావర్ అంటే ఎవరు..? అన్న విష‌యాలు చాలా మందికి అవ‌గాహ‌న లేక‌పోవ‌చ్చు. వాస్త‌వానికి వావర్ యుద్ధవిద్యలో ఆరితేరినవాడు. ఒకప్పుడు అతడు అయ్యప్పతో మూడురోజుల పాటు యుద్ధం చేశాడ‌ట‌. అయితే ఇద్దరూ యుద్ధంలో సమానమైన ప్రతిభను ప్రదర్శించారు. అయ్యప్ప ఆయుధాన్ని పడవేసి వావర్ ను కౌగలించుకొని స్నేహం పొందాడు. తర్వాత కాలంలో వావర్ అయ్యప్పకు ప్రముఖ శిష్యుడైనట్లు చెబుతారు.

 

అయ్యప్ప పండలం రాజును వావర్ కు ఒకమసీదు కట్టించమని సూచించినట్లు చెబుతారు. అందుకే శబరిమలలో ప్రధాన ఆలయం సమీపంలో వావర్ పేరుతో మసీదు నిర్మాణమయింది. ఇస్లాం మత ఆచారం ప్రకారం ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠ కాలేదు. కాని, వావర్ ఉనికిని చూపుతూ కేవలం వంపుతిరిగిన ఒక శిల మాత్రం ఉన్నది. ఇక అయ్యప్ప దర్శనానికి వెళ్లే భక్తులు ఎరుమేలిలోని వావర్‌ స్వామి మసీదును తప్పకుండా దర్శించుకుంటారు.

 

 

  

మరింత సమాచారం తెలుసుకోండి: