రేపు శ్రీరామనవమి.. శ్రీరాముడు జన్మదిన నాడు శ్రీరామనవమి పండుగ చేసుకుంటారు. అలాంటి ఈ శ్రీరామనవమి పండుగ నాడు శ్రీరాముని స్మరిస్తూ ఓ చిన్న పని చేస్తే చాలు అదృష్టవంతులు అయిపోతారు. ఆ చిన్న పని ఏంటి అనేది మనం ఇక్కడ చదివి తెలుసుకోండి.. ''ఓం నమో నారాయణాయ'' అనే అష్టాక్షరి మంత్రంలోని ''రా'' అనే ఐదవ అక్షరం ''ఓం నమశ్శివాయ'' అనే పంచాక్షరీ మంత్రంలోని ''మ'' అనే రెండవ అక్షరం కలిస్తే ''రామ'' అనే నామం అయింది. 

 

అంటే హరిహరతత్త్వాలు రెండు నామాలు కలిసిన నామం రామ నామం అయ్యింది..  రామ అనే పదాన్ని గమనిస్తే ర, అ, మ లు కలిస్తే 'రామ' అవుతుంది. 'ర' అంటే అగ్ని. 'ఆ' అంటే సూర్యుడు, 'మ' అంటే చంద్రుడు అని అర్థం వస్తుంది. అంటే 'రామ' అనే పథంలో విశ్వాసానికి మూలమైన మూడు శక్తులు ఉన్నాయని చెప్పకనే చెప్తారు. 

 

అంతేకాదు 'రామ' అనే నామంలోని 'రా' అనే అక్షరం భక్తులను సంసారసాగరం నుంచి రక్షిస్తుందనీ 'మ' అనే అక్షరం భక్తుల మనోరథాలను నెరవేరుస్తుందని మహర్షులు పేర్కొనగా 'రామ' అనే పదంలోని 'రా' అక్షరం పలికేటప్పుడు నోరు తెరుచుకుని మనలోని పాపాలన్నీ బయటకు వచ్చి అగ్నిజ్వాలల్లో పడి దహించుకుపోతాయనీ, 'మ' అనే అక్షరం పలికేటప్పుడు నోరు మూసుకుని బయటి పాపాలని మనలోనికి ప్రవేశించవని చెప్తున్నారు. 

 

కాగా 'రామ రామ రామ' అని మూడుసార్లు నామ జపం చేస్తే శ్రీవిష్ణుసహస్రనామం చేసినంత ఫలం లభిస్తుందని అందుకే ఈ చిన్న రామ నామం జపించడం వల్ల భక్తులను సంసారసాగరం నుంచి రక్షిస్తుందనీ.. పాపాలు పోతాయ్ అని అంటున్నారు. అంతేకాదు ఒక్క శ్రీరామ నవమి నాడే కాదు మనకు సమయం ఉన్నప్పుడు రామ నామం స్మరించడం వల్ల మనకే మంచి జరుగుతుంది. శ్రీ రామ జయ రామ జయ జయ రామ అని స్మరించడం వల్ల కూడా మంచే జరుగుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: